అక్టోబర్ 2021

మీర్జా పేట సచివాలయాన్ని సందర్శించిన,,,

జిల్లా పంచాయతీ అధికారి

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మీర్జా పేట సచివాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి సందర్శించారు. అక్కడి సర్పంచ్, సభ్యులతో, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామస్తుల సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని  ఆదేశించారు. ఆదర్శ గ్రామాలుగా మారాలంటే ప్రతి ఒక్కరూ  మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను పెరిగే వరకు వాటిని కాపాడాలని సూచించారు. వారే స్వయంగా ఒక మొక్కను నాటారు.

ముఖ్యంగా జగనన్న స్వేచ్ఛ  సంకల్పంతో భాగంగా ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి హరిత రాయబారులు చెత్త సేకరణ జగనన్న స్వచ్ఛ సంకల్పం ఆప్ లో నమోదు చేయుట గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సూరెడ్డి .రామసుబ్బారెడ్డి, దేవి రెడ్డి భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, ఎక్కంటి రామిరెడ్డి, దేవి రెడ్డి లింగారెడ్డి, శేషయ్య, మరియు మురారి వెంకటేశ్వర్లు, వెన్న సత్యనారాయణ రెడ్డి, తర్లుపాడు మండల  పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

 గొర్రెలు....మేకలపై ఆంత్రాక్స్ ఆటాక్

మటన్‌ ప్రియులు జరజాగ్రత్త

పరిశుభ్రత ఎంతో కీలకం...లేదంటే ప్రాణాలకే ప్రమాదం..!!

మారుమూల గ్రామాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

నాన్ వెజ్ అంటే ఒకపుడు పరిమిత రోజులకే తినేవారు.  లేకపోతే ఏ పెళ్లిళకో...ప్రత్యేక కార్యక్రమాలలోనే ఉండేది. కానీ  మారుతున్న జీవన శైలీలో మాంసహారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే చిక్కెన్ మొదలు చేపలు, మటన్ ధరలు  రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ మటన్ అంటే మరో ప్రత్యేకత.  ఆదివారం వచ్చిందంటే చాలు మటన్‌ షాపుల దగ్గర మాంసం ప్రియులు క్యూ కడుతారు. ఎంత సమయమైనా సరే వేచి చూసి మటన్ తీసుకొని ఇంటికి వస్తారు. 

ఎందుకంటే మాంసం అంటే వారికి అంత ప్రీతి. ఇక కొంతమందికైతే ముక్క లేనిదే అసలు ముద్ద దిగదు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. మటన్‌ తినొద్దని ఎవ్వరూ చెప్పడం లేదు. కానీ పరిశుభ్రమైన మటన్‌ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మేకలకు, గొర్రెలకు వింత రోగాలు సంభవిస్తున్నాయి. వీటి గురించి తెలిసి కొందరు,తెలియక కొందరు వ్యాపారులు ఇష్టారీతిన తమకు నచ్చిన రీతిలో మాంసం విక్రయాలు జరుపుతున్నారు. తక్కువకు వస్తుంది కదా.. అని తీసుకొని తిన్నారనుకో మరునాడే ఆస్పత్రి బెడ్ పై ఉండాల్సి వస్తుంది.  తాజాగా తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల్లో ఆంత్రాక్స్‌ వ్యాధి విజృంభిస్తోంది. దాని సంగతేందో తెలుసుకుందాం. మటన్‌ తీసుకునే ముందు ఒక్కసారి ఆ జీవాలను పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో తెలుసుకోవాలి.   మటన్ కొట్టు వారు చెప్పేది మీరు అబద్దమని భావిస్తే ఒక్కసారి జీవాలను కట్‌ చేసిన స్థలాన్ని పరిశీలించాలి. గొర్రెను కానీ మేకను కానీ కోసినప్పుడు వెలువడే రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆ జీవానికి ఆంత్రాక్స్‌ సోకినట్లు గుర్తించాలి. ఇటువంటి జీవాల మాంసాన్ని విక్రయించకూడదని ప్రభుత్వం ఇప్పటికే మాంసం వ్యాపారులకు హెచ్చరించింది.

ముఖ్యంగా మారుమూల గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఎందుకంటే అక్కడి కొంతమంది గొర్ల, మేకల కాపర్లకు ఈ వ్యాధిపై అవగాహన ఉండదు.  ఏదో జబ్బు చేసి చనిపోయి ఉంటుందని భావిస్తారు. అంతేకాదు జీవి చనిపోతే దానిని కోసి మాంసం విక్రయించడం లేదంటే వారే వండుకొని తినడం చేస్తారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఆంత్రాక్స్‌ అనేది చాలా డేంజర్‌ వ్యాధి.  ఒక్కసారి సోకిందంటే దాని ఆనవాళ్లు 60 ఏళ్ల వరకు ఉంటాయి.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

 మస్జిద్-ఎ-రసూల్ లో,,,

అలరించిన నాతియా ముషాయిరా


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల  ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాలలోని మస్జిద్-ఎ-రసూల్ లో నాతియా ముషాయిరా ఎంతగానో అలరించింది. ఈ  నాతియా ముషాయిరా ఉర్దూ ప్రియులను అలరించింది. రాష్ట్ర ఇత్తేహాదుల్ ఉలమాయె హింద్ ఆధ్వర్యంలో జరిగిన ఉర్దూ గేయకారుల నాతియా ముషాయిరాకు నంద్యాల జమాఆతె ఇస్లామి హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమద్ అధ్యక్షత వహించారు, హాఫీజ్ ముహుమ్మద్ సలీం పర్వేజ్ కన్వీనర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉర్దూ అకాడమీ మాజి చైర్మెన్ డా.ముహమ్మద్ నౌమాన్,

హైదరాబాదు పీఠాధిపతి సయ్యద్ హుస్సేన్ పీర్, ఇత్తేహాదుల్ ఉలుమా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ షఫీవుల్లా, కోఆప్షన్ కౌన్సిలర్ సయ్యద్ సలాముల్లా, కౌన్సిలర్ తమీమ్, ప్రముఖ జాతీయ స్ధాయి ఉర్దూ గాయకులు, యూపి ప్రతాప్ ఘడ్ కు చెందిన హాఫీజ్ సాబీర్ సిధ్దీఖ్ , హైదరాబాద్ ఖారి మౌలానా అబ్దుల్ రెహమాన్, నెల్లూరుకు చెందిన హాఫీజ్ ఉస్మాన్,మౌలానా తయ్యిబ్, వెలుగోడు నంద్యాల ఉర్దూ కవులు పాల్గొని మధురమైన స్వరంలో ప్రవక్త ముహమ్మద్ (స) గుణగణాలు, జీవిత ఘట్టాలు వివరించారు.అనంతరం కవులకు శాలువా కప్పి మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈసంధర్భంగా అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ఈ మూషాయీరాల ద్వారా ఉర్దూ భా‌షా ప్రోత్సహించే బడటమే కాక సాహిత్య మాధుర్యం ఆస్వాదించ బడుతుందనీ, ప్రతీ సంవత్సరం నిర్వహించ బడుతుంది  తెలిపారు.

 ఏపీ, తెలంగాణ కలయిక...

కలలో  కూడా సాధ్యం కాదు

సమస్యలను దారిమళ్లించేందుకే ఈ వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణా ఆంధ్ర రాష్ట్రాలు తిరిగి విలీనం చేయాలనే కుట్ర జరుగుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ విమర్శించారు. అది అడ్డుకోవటానికి ప్రాణ త్యాగానికైనా సిద్దమని కొందరు, రెండు రాష్ట్రాలు ఒకటైతే తప్పేమిటని మరికొందరు తమ రాజకీయ స్వప్రయోజనాలకు , తెలంగాణా ప్రజల మనోభావాలు, ఆత్మ స్థైర్యము దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదన్నారు. ఈ సందర్భంగా జి.నిరంజన్ మాట్లాడుతూ...ఇలాంటి వ్యాఖ్యలు  చేసేవారిని తెలంగాణా ప్రజలు క్షమించరు. తెలంగాణా ఉద్యమంతో ఎటువంటి సంబందం కానీ, సానుభూతి కానీ లేని వారు మాత్రమే రాజకీయ దురుద్దేశంతో, స్వార్థ బుద్దితో రెండు రాష్ట్రాలు కలిసే కుట్ర జరుగుతోంది, ఈ వ్యాఖ్యలు అసందర్భంగా చేస్తున్నారు. ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అసందర్భ వ్యాఖ్యలు. 60 సంవత్సరాల పోరాటంతో, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణాను తిరిగి విలీనము చేసే సాహసము కె.సి.ఆర్ తో సహా ఎవరూ చేయలేరు, ఒక వేళ చేస్తే బ్రతికి బట్ట కట్ట లేరు. తెలంగాణా రావడము ఆలస్యమవుతుందని, నిరాశ నిస్పృహలతో ఆత్మ హత్యలతో జీవితాలను బలి చేసుకున్న అమర వీరుల త్యాగాలను మరిచి కొందరు తమ రాజకీయాలకు తెలంగాణా ప్రజలను కృంగదీసే వ్యాఖ్యలు చేయడము సహించరానివి. 60 సంవత్సారాల పాటు రెండు రాష్ట్రాలుగా విడగొట్టకుండా సమైక్యముగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు విపలమైన తరవాతనే, విధ్యార్థులు యువజనుల బలిదానాలతో చలించిపోయిన శ్రీమతి సోనియా గాంధి గారు తెలంగాణా రాష్ట్రం సాకారము చేశారు. ఆ విషయాన్ని ఎవరూ మరిచిపోకూడదు. ఈ విషయమై అనవసర అపోహలు కల్పించడం క్షంతవ్యము కాదు. సోనియా గాంధీ గారు మాతృ హృదయముతో చేసిన మేలును తృణీకరించినట్లవుతుంది తెలంగాణా ఏర్పడిన తరువాత ప్రజలు కోరుకున్న విధముగా పరిపాలన సాగకుంటే, ఆకాంక్షలు నెరవేరకుంటే సరిదిద్దుకునే సత్తా ప్రజాస్వామ్యబద్దముగా తెలంగాణా ప్రజల కున్నది.  కానీ తిరిగి కలువడమనేది కలలో కూడా జరుగదు. స్వార్థ రాజకీయాలు చేసే వారు దింపుడు కళ్లెం ఆశలు మానుకోవాలి. ప్రజలను ఆందోళనకు గురిచెయవద్దు. మరిన్ని ఆత్మ హత్యలకు గురి చేయవద్దు. అని ఆయన వ్యాఖ్యానించారు.

 ఏంపీజే ఆధ్వర్యంలో,,,,

ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం జిల్లా ప్రతినిధి)

ఏంపీజే ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఖమ్మం జిల్లా ఎమ్.పి. జె., కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు ఖమ్మం నగర ఉప మేయర్ ఫాతిమా ముఖ్తార్, 38 వ డివిజన్ కార్పొరేటర్  ఆలియా షౌకత్ కి అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ ఆధ్వర్యంలో సన్మాన కార్య క్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఎమ్.పి.జె., ఉపాధ్యక్షులు గఫార్, జహీర్, కార్యదర్శులు రజబాలి, సతీష్, సహాయ కార్యదర్శి రఫీఖ్,  కోశాధికారి హకీమ్, సేవా బ్యాంకు డైరెక్టర్  నజీముద్దీన్,  నాయకులు అజీజ్, సుజా, అన్వర్, రియాసత్, అక్రమ్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

 రైట్ టైమ్ లో రిలీజవుతున్న 'రాంగ్ స్వైప్'

# డా.రవికిరణ్ ప్రతిభకు 

నిలువుటద్దం పట్టిన "రాంగ్ స్వైప్"

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

    డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో 'మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్" పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశభరిత వినోదాత్మక చిత్రం "రాంగ్ స్వైప్". క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే... ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ "ఊర్వశి ఓటిటి" ద్వారా నవంబర్ 1న విడుదల కానుంది. 


    స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్... సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతోపాటు... ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు.


      నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ... "లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అన్నీ తానే అయి ముందుండి నడిపించారు. మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన "రాంగ్ స్వైప్" అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు" అన్నారు!!


 


 త్రిపురలో ముస్లింల పై దాడుల నివారణలో,,,,

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

నంద్యాల ముస్లిం జేఎసి

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

త్రిపుర రాష్ట్రంలో వారం రోజులుగా ఏకపక్షంగా ముస్లీంలు పై , మస్జిద్ ల పై జరిగిన దాడులు నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని నంద్యాల ముస్లిం జేఎసి స్పష్టం చేసింది. క్రాంతి రేఖ గ్రంధాలయం లో జేఎసి కన్వీనర్ అబ్దుల్ సమద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో కన్వీనర్ ముహమ్మద్ అబులైస్, మస్తాన్ ఖాన్, జావేద్ హుసేన్, ముహమ్మద్ ఫారూఖ్,డి.మస్తాన్  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలీసుల త్రిపురలో సాక్షిగా మస్జీదులు ధ్వంసం అయ్యాయి, మతతత్వ గుండాలు మజీదుల పై కాషాయ జెండాలు ఎగురవేసి పైశాచికత్వం చూపారు, ముస్లిం పురుషులను, స్త్రీలను పిల్లలను తమ ధాష్టికాలతో భయభ్రాంతులకు సృష్టించారు. ఇన్ని దాఢులు జరిగిన, ఆటవిక ప్రదర్శనలు చేసిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు, ఇంతవరకు దుండుగులను అరెస్ట్ చేయక పోవడం శోచనీయమని, ప్రజాస్వామ్యం పరిరక్షించి, లౌకిక విలువలు కాపాడి, దుండుగులను అరెస్టు చేయాలని జేఎసి డిమాండు చేసింది.

మహిళలపై దుర్భాష లాడుతున్న సచివాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోండి....

ఇటీవల నంద్యాలలో, మొన్న ఆదోని లో ముస్లిం మహిళా ఉద్యోగిని పై అహంకారంతో, తెరకెక్కిన మతమౌఢ్యంతో దుర్భాషలడటం ఆక్షేపనీయమని నంద్యాల ముస్లిం జేఎసి తీవ్రంగా నిర్వహించింది. ముస్లిం లను పాకీస్తాన్ వెళ్ళమన్న వెధవ పై చర్య తీసుకోవాలని ఇలాంటివి పునరావృతం అయితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని , ఇది ముస్లిం మనోభావాలను కించపర్చటమే అని జేఎసి స్పష్టం చేసింది.

  ఎంపీడీవో కార్యాలయంలో అట్టహాసంగా...

 ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి జన్మదిన వేడుకలు       


 
(జానో జాగో వెబ్ న్యూస్_ తర్లుపాడు ప్రతినిధి)

    ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని ఎంపీడీవో కార్యాలయంలో అట్టహాసంగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. తర్లుపాడు మండలం ఎంపీడీవో ఆఫీసులో తర్లుపాడు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు యువ నేత, హృదయ శీలి, నిగర్వి, విద్యావంతుడు అయినా కుందూరు నాగార్జున రెడ్డి కి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


అందులో భాగంగా కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్తూ  అభిమానులందరికీ కేక్  పంచడం జరిగింది ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, మండల ఎంపిటిసిలు,  మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ అలీ, వైసిపి నాయకులు,అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీడీవో సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్ లు వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.


 



 ఈ క్రాఫ్ నమోదు చేయించుకుంటేనే...

ప్రభుత్వ రాయితీలు

మండల వ్యవసాయ అధికారి ఆర్ చంద్రశేఖర్ రావు


(జానో జాగో వెబ్ న్యూస్_ తర్లుపాడు ప్రతినిధి)

  ప్రకాశం జిల్లా  తర్లుపాడు మండలం లోని తుమ్మలచెరువు రైతు భరోసా కేంద్రం నందు డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి  మండల వ్యవసాయ అధికారి ఆర్ చంద్రశేఖర్ రావు  మాట్లాడుతూ కంది పంటలో విత్తనం నుండి విక్రయం వరకు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అలాగే కంది పంటలో సమగ్ర సస్యరక్షణ (IIM) మరియు సమగ్ర పంట యజమాన్యం (ICM) పద్ధతులపై రైతులకు తగు సూచనలు మరియు సలహాలు తెలియజేశారు. పంట వేసిన ప్రతి రైతు తప్పనిసరిగా


ఈ క్రాఫ్ నమోదు చేయించుకుంటేనే ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ, పంటల బీమా, పంటకు గిట్టుబాటు ధర కు అర్హులు అవుతారని తెలిపారు. పొలం లో ఉన్నటువంటి కంది పంటను పరిశీలించి రైతులకు తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలచెరువు గ్రామా వ్యవసాయ సహాయకులు టి.భూపాల్, తర్లుపాడు మండలం లోని రైతు భరోసా సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

 రైతు పాలిట ఆపద్బాంధవుడు వైయస్ జగన్

గడివేముల మండల వైఎస్సార్సీపీ సమావేశంలో నేతలుు

(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం లోని గడివేముల మండలం లోని వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు, గడివేముల మండల జెడ్ పి టి సి .ఆర్ .బి .చంద్రశేఖర్ రెడ్డినీ కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గడివేముల మండల వై ఎస్ ఆర్ సి పి, నాయకులతో, కార్యకర్తలతో  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గా గడివేముల మండల జడ్పిటిసి సభ్యులు ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ,వైయస్సార్సీపి అధినాయకులు జగన్ మోహన్ రెడ్డి రైతు పాలిట ఆపద్బాంధవుడు అని ,రైతుల ఆనందం కోసం ఒకే రోజు మూడు పథకాలు ప్రారంభించి రైతుల ఇళ్లల్లో దీపావళి పండుగ రాకముందే రైతుల్లో ఇళ్లలో దీపావళి కాంతులు విరజిమ్మేలా చేసి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు అని, అదేవిధంగా గడివేముల మండలంలో గత టిడిపి ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు టిడిపి ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండానే ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకుందని, అనంతరం అధికారంలోకి వచ్చిన మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 

కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి

పెండింగ్లో ఉన్న బిల్లులు అన్నింటినీ చెల్లించడం జరిగిందని, ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలతో, అభివృద్ధి  పథకాలతో ప్రజల వద్దకు దూసుకుపోతున్నాడు అని, గడివేముల మండలం లోని పొదుపు మహిళలకు గాను పది వేల రూపాయల వడ్డీ ని పార్టీలకు అతీతంగా అందజేయాలని అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అధికారులకు సర్పంచులకు ఆదేశాలు ఇచ్చారని, ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం మండలంలోని ప్రతి సర్పంచులు సంతకాలు చేసి అధికారులకు అందించామని, టిడిపి నాయకులు ప్రతి కార్యక్రమంలో దొంగలే ..దొంగ ...దొంగ ....అని అరుస్తూ నిజాన్ని అబద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారని దీనిని ప్రజలు ఎవరూ నమ్మరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల వ్యవసాయశాఖ సొసైటీ అధ్యక్షులు బిలకలగూడూరు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ ,తిరుపతి రెడ్డి, చిందుకూరు మాజీ సర్పంచ్ వెంకట కృష్ణారెడ్డి, గడిగరేవుల రామ్మోహన్ రెడ్డి, కొర్ర పోలూరు సుబ్బారెడ్డి, వివిధ మండలాల వైసిపి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

 ఆర్యవైశ్యుల పట్ల సీఎం నిర్ణయం చారిత్రాత్మకం

సీఎం చేసిన మేలు మరువలేనిది

ఎమ్మెల్యే అన్నా రాంబాబు


గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఆర్యవైశ్యుల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ అంటేనే గుర్తుకువచ్చే ఆర్యవైశ్యులు పూర్వం విశేషమైన సేవలు  చేయుటకు ఆర్యవైశ్య పెద్దలు వారి సొంత ఆస్తులు రాష్ట్ర వ్యాప్తంగా విరాళంగా ఇచ్చిన వేలకోట్ల ఆస్తులు, శ్రీ వాసవి మాత ఆలయాలు కాలక్రమంలో దేవాదాయ శాఖలో విలీనం చేయబడినాయన్నారు. నాడు ఆర్యవైశ్య పూజ్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోశయ్య చొరవతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వైశ్యుల మీద ఉండేటటువంటి అపారమైన ప్రేమ, గౌరవంతో శ్రీ వాసవి మాత ఆలయాలను వైశ్యులే సొంతగా నిర్వహించుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. నాటినుండి వాసవి మాత ఆలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెంది విశేషంగా పూజాకార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. దానిని ఆదర్శంగా తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ నాలుగు అడుగులు ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులకు దిశానిర్దేశం చేస్తూ ఎంతోమందికి ఉన్నత పదవులను వచ్చేందుకు సహకరిస్తూన్నారన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెలంపల్లి శ్రీనివాస్ చొరవతో ఆర్యవైశ్యుల చిరకాల కోరిక అయినటువంటి ఆర్యవైశ్య సేవా సంస్థలను వైశ్యులే నిర్వహిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు వారికి అవకాశం కల్పించే విధంగా మంత్రి వర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమన్నారు. ఆర్యవైశ్యుల యొక్క ఆస్తులైన ఆర్యవైశ్య సత్రాలు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఆర్యవైశ్య సంఘాలకు చెందిన ఇతర ఆస్తులు  అన్నింటి పైన పూర్తి అధికారం ఆర్యవైశ్యలకే చెందేటట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక మైనదన్నారు. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సోదరులందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

 వ్యవస్ధ మార్పుకు దోహదం చేసే జాతీయ విద్యావిధానం 

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్


 
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

నాణ్యమైన ఉన్నత విద్య వ్యక్తిగత సాఫల్యంతో పాటు, సమాజానికి ఉత్పాదక సహకారాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విద్యార్థులను అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి కోసం సిద్ధం చేయవలసిన బాధ్యత విద్యాసంస్ధలపై ఉందన్నారు. తాడేపల్లి గూడెం నిట్ లో  “విజన్ ఆఫ్ ఎన్ఇపి 2020 ఆన్ రీసెర్చ్ అండ్ ఎక్స్ ట్రా కరిక్యులర్ పారామీటర్స్ ఫర్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్” అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన సదస్సుకు గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గౌరవ హరిచందన్ ప్రసంగించారు. జాతీయ విద్యా విధానం 2020 దేశంలోని యువ తరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, దూరదృష్టితో భారత ప్రభుత్వం రూపొందించిన విధానాలలో ఒకటని గవర్నర్ అన్నారు.

దేశంలో ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు వ్యవస్థను పునరుద్ధరించడం, నేపథ్య పరిస్థితుల కారణంగా ఏ పిల్లవాడు చదువుకు దూరం కాకుండా చూడటమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 2030 నాటికి పాఠశాల విద్యలో 100 శాతం స్థూల నమోదు లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. సంపూర్ణ విద్య సమ్మిళిత, సంస్కారవంతమైన, ఉత్పాదక, ప్రగతిశీల, సంపన్న దేశాన్ని నిర్మించేలా చేస్తుందన్నారు. పరిశోధనలు బలంగా ఉన్న ఉన్నత విద్యా సంస్ధలలో అత్యుత్తమ బోధన, అభ్యాస ప్రక్రియలు మెరుగ్గా ఉంటాయని ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు నిరూపిస్తున్నాయన్నారు. పరిశోధనలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడంలో, సమాజాన్ని ఉద్ధరించడంలో, ఒక దేశాన్ని నిరంతరం ప్రేరేపించడంలో కీలక మన్నారు. భారతదేశంలో పరిశోధన, ఆవిష్కరణల పెట్టుబడి జిడిపిలో 0.69శాతం మాత్రమే ఉండగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2.8శాతం, ఇజ్రాయెల్‌లో 4.3 శాతం ఉందని గవర్నర్ అన్నారు. 

నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్ని విశ్వవిద్యాలయాలలో పరిశోధనా సంస్కృతి విస్తరించేలా చూసే లక్ష్యంతో నాణ్యమైన అకడమిక్ పరిశోధనను ఉత్ప్రేరకపరుస్తుందన్నారు.  సామాజిక సవాళ్లైన పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు. జాతీయ విద్యా విధానం-2020 దేశంలోని విద్యా రంగాన్ని మారుస్తుందనడంలో సందేహం లేదని,  విద్యను అందుబాటులోకి తీసుకురావడం, సమానత్వంతో అందరినీ కలుపుకు పోవడంపై ఇది దృష్టి సారిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తాడేపల్లి గూడెం నుండి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.ఎస్.పి. రావు తదితరులు పాల్గొన్నారు. 

 మెడికల్ మాఫియా..!

వైద్యం పేరుతో అన్ని దోపిడీ..!!

మామూళ్ల మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్లు...?

రిఫర్ చెయ్యి డబ్బు పట్టు అనే ధోరణి లో వైద్యులు

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్  మాఫియా  చాపకింద  నీరులా విస్తరిస్తోందా...? వైద్యం వెరీ కాస్ట్లిగా మారుతోందా అంటే అవుననే చెప్పవచ్చు. వైద్యుల తీరుపైనా మెడికల్ వ్యాపారుల ధోరణీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాధి నిర్ధారణ టెస్టుల  పేరుతో కొంత మంది ఎం.బీ.బీఎస్, ఆర్ఎంపీ వైద్యుల దోపిడీకి అదుపే లేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్నాయి.

డాక్టర్లు చెప్పడం తో అన్ని రకాల టెస్టులకు వేలకు,వేలు పెట్టి టెస్టులు చేయిస్తున్న సామాన్య ప్రజలు అనేక ఆర్థిక  ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ రకాల  టెస్ట్ లకు ప్రభుత్వం తరుపు నుంచి నీర్ణిత ధర నిర్ణయించకపోవడంతో టెస్ట్ ల  పేరుతో ల్యాబ్ లు ఆసుపత్రలు విచ్చల విడిగా దోచుకొంటున్నారు. అమరావతి పరిధిలో విచ్చల విడిగా ,యథేచ్ఛగా అధిక ధరల విక్రయాలకు జనరిక్, ఇతర మందుల విక్రయాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్ చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి.

అమ్మకోడాని మందులు అంటే డాక్టర్లు రాసిచ్చిన చిట్టీ లేకుండా (అబ్షాన్ మందులు మెడికల్  షాప్ యజమానులు విక్రయిస్తున్న ఉద్దంతాలు అనేకంగా ఉన్నాయి. జిల్లా అధికారుల తనిఖీలు ఎక్కడా, ప్రతి ప్రవేట్ ఆసుపత్రుల్లో అనుమతులు లేకుండా మందుల విక్రయాలు సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థికి కారణం మామూళ్ల మత్తే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

 గ్రామానికో ట్రాక్టర్‌.. 

ఏపీ సర్కార్‌ కసరత్తు

రెండు వేల జనాభా దాటిన 5,228 గ్రామాలకు అందజేత

గ్రామ అవసరాలకు వినియోగం


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

రాష్ట్రంలో రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక్కొక్క ట్రాక్టర్‌ చొప్పున సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ట్రాక్టర్లను సంబంధిత గ్రామ పంచాయతీలు బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఆదాయం రూపంలో సదరు గ్రామ పంచాయతీలకు లభించేలా చర్యలు చేపడుతోంది. ఇలా చేయడం ద్వారా గ్రామాల్లో రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్‌ ద్వారానే నీటి తడులు అందించడం, నూరు శాతం మొక్కలను బతికించడం, గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడం వంటి పనులను సులభతరం అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

5,228 గ్రామాలకు ఉచితంగా అందజేత 

రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 5 వేలకు పైబడి జనాభా ఉండే గ్రామాలు 1,252 ఉన్నాయి. వీటిలో 1,161 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే సొంత ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి. 5 వేల జనాభాకు పైబడిన గ్రామాల్లో 91 చోట్ల మాత్రమే పంచాయతీలకు సొంతంగా ట్రాక్టర్లు లేవు. ఇవి కాకుండా 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5,137 వరకు ఉన్నాయి. వీటికి కూడా సొంత ట్రాక్టర్లు లేవు. ఈ నేపథ్యంలో 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని 91 పంచాయతీలతోపాటు, 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు కలిపి మొత్తం 5,228 గ్రామాలకు ప్రభుత్వం కొత్తగా ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా వీటిని ఉచితంగా సమకూరుస్తుంది. గ్రామాల్లో రోడ్లపక్కన పోగయ్యే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన నాటే మొక్కలకు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నీటి తడులు అందించడం ద్వారా ప్రతి మొక్కను బతికించేందుకు ఈ ట్రాక్టర్లను ఉపయోగిస్తారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా అవే ట్రాక్టర్లను ఉపయోగించుకునేలా చూస్తారు. 


 

పంచాయతీలపై నిర్వహణ భారం పడకుండా..

ట్రాక్టర్‌ రోజువారీ నిర్వహణ సంబంధించి పంచాయతీకి భారం కాకుండా ఉండేలా కొన్నేళ్లపాటు ఆ గ్రామానికి అదనపు ఆదాయం పొందేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దానిపై పంచాయతీ అధికారులకు అవగాహన కల్పిస్తారు. రోడ్ల పక్కన నాటే మొక్కల పెంపకానికి గాను.. నాటిన ప్రతి మొక్కకు రెండేళ్లలో 56 విడతలుగా నీటి తడులు ఇవ్వడానికి (ఒక్కొక్క తడికి రూ.5 చొప్పున) రూ.280 చొప్పున ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు చెల్లిస్తోంది. ఇలా 400 మొక్కలు ఒక యూనిట్‌గా చేసుకుని ప్రతి యూనిట్‌కు రూ.1.12 లక్షల చొప్పున అందజేస్తోంది. ఇకపై మొక్కలకు నీటి తడులు ఇచ్చే బాధ్యత ప్రైవేట్‌ వ్యక్తులకు కాకుండా గ్రామ పంచాయతీలకే అప్పగిస్తారు. తద్వారా ఆ మొత్తం గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయంగా సమకూరుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ గత ఏడాది రాష్ట్రంలో 15 వేల కిలోమీటర్ల మేర, ఈ ఏడాది  10 వేల కిలోమీటర్ల మేర మొక్కలు నాటింది. సగటున ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 1.60 కిలోమీటర్ల పొడవున ప్రస్తుతం మొక్కల పెంపకం కొనసాగుతుంది. పంచాయతీల ఆధ్వర్యంలోనే ట్రాక్టర్‌ ద్వారా నీటి తడులు అందజేస్తే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సరాసరి రూ.1.80 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ సొమ్మును ట్రాక్టర్‌ డీజిల్, డ్రైవర్, మరమ్మతు ఖర్చులకు వినియోగించుకునే వీలుంటుందని అధికారులు చెప్పారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

 బీసీల కులగణన చేపట్టాలి

గడివేముల ఎమ్మార్వోకు ఏపీఎంబీసీ సంక్షేమ సంఘం వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

బీసీల కులగణన చేపట్టాలని గడివేముల ఎమ్మార్వోకు ఏపీఎంబీసీ సంక్షేమ సంఘం వినతి పత్రం అందజేసింది. అదే సందర్భంలో గడివేముల ఎమ్మార్వో నాగమణికి జ్యోతిరావు పూలే చిత్రపటంను నేతలు బహుకరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కె ప్రసాదు మాట్లాడుతూ గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ బీసీల కుల గణన చేయకపోవడం చాలా బాధాకరమని ఎందుకంటే బీసీలు సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా బీసీల కులగణన జరగాల్సిందేనని ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు 1156 అంటరాని కులాలుగా ఉన్న అన్నిటిని ఎస్సీ అన్న గొడుగు కిందికి, అంబేద్కర్ తీసుకురావడమే కాకుండా వారి యొక్క జనాభా ప్రాతిపదికన 15 శాతం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో రాజ్యాంగ పరంగా ఈ రోజు పొందుతున్నారు.

దానితోపాటు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క కుల గుణ చేయడం జరుగుతుంది కానీ బీసీలకు ఇంతవరకు జనాభా లెక్కలు చేయలేదు కానీ ఈరోజు ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో బీసీల జనాభా లెక్కల తో పాటు ప్రతి కులాల జనాభా లెక్కలను కూడా చేయాలని తీర్మానించడం, సంతోష విషయమైనా దానితోపాటు గత ప్రభుత్వము అమలు చేసిన జీవో నెంబర్ 17 పునరుద్ధరణ చేయాలని అలాగే బిసి కులాల స్థితిగతులపై అధ్యయనం చేసి బీసీ, ఎంబీసీ, డిఎన్టీ లుగా, విభజన చేసి బీసీల కు సమన్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యలవాడ వెంకటేశులు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు అయ్యన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రసాదు, కర్నూలు జిల్లా సెక్రెటరీ కె.గోపాలు, జిల్లా కోశాధికారి వై మద్దిలేటి, గని గ్రామ సెక్రెటరీ జి .వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

 పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా,,,

“ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ “ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు “ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ “ మార్కాపురం సబ్  బ్రాంచ్, చైర్మన్ డాక్టర్ చెప్పలి కనకదుర్గ  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఒక విలువైన ప్రాణాన్ని కాపాడవచ్చని తెలిపారు.

ముఖ్యంగా ఈ కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా పట్టణ మరియు గ్రామాలకు సంబంధించిన పోలీసు సిబ్బంది పైఅధికారుల స్ధాయి నుంచి క్రింది స్ధాయి ఉద్యోగులంతా రక్తదానం ఇచ్చేందుకు ముందుకు రావడం వారి ప్రజా సేవలకు నిదర్శనమని తెలిపారు.

ఈ కార్యక్రమములో డిఎస్పీ కిషోర్ కుమార్, సి.ఐ. బి టి నాయక్, మరియు పట్టణ గ్రామీణ ఎస్.ఐ.లు నాగరాజు, కోటయ్య మరియు మార్కాపురం పట్టణ షాదీఖానా ప్రధాన కార్యదర్శి ఎస్ హెచ్ కె. కరీంబాష (KPyouth), లాయర్ కంది నారాయణ రెడ్డి , కో ఆప్షన్ నెంబర్ గుంటక నజాక్షి, వార్డు ఇంచార్జ్ లు గుంటక చెన్నారెడ్డి , రోజ్ లిడియా పాల్గొన్నారు.



 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

 ఓ‌టర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు

ఎన్నికల కమిషన్ కు జి.నిరంజన్ ఫిర్యాదు

ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలి


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

హుజురాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల మారిందని టీ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ పేర్కొన్నారు. అధికార పార్టీ ఓటర్ల ను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్ కు  ఆయన ఓ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పేపర్లలో వచ్చిన వార్తలను బట్టి ఒక లక్ష 50 వేల మందికి 3 గంటల్లో 90 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. శశాంక్ గోయల్ అధికారులకు చెప్పక ముందే అన్ని పనులు అయిపోయాయి. ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తున్నాం.. ఎన్నికల కమిషన్ ను ఇప్పటికైనా ఒక సీనియర్ అధికారిని పంపించి చర్యలు తీసుకోవాలి.


మొన్న కేసీఆర్ ఒక సీఎం గా ఎన్నికల కమిషన్ ను హెచ్చరించారు. శశాంక్ గోయల్ ఆ మాటలు విన్న కూడా ఏమి చేయలేదు. ఎన్నికల ప్రధాన అధికారి యే ఏమి చేయకపోతే ఇక జిల్లా స్థాయి అధికారులు ఏమి చేస్తారు. ఏమి చేసినా మీరు కళ్ళు మూసుకొని ఉండాలని కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. ఐదు నెలలుగా హుజురాబాద్ లో అడ్డగోలు అధికార దుర్వినియోగం చేశారు. మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా రుణ మాఫీ చెక్ లు ఇచ్చామని చెప్పారు, రామాలయం, దర్గా లకు నిధులు ఇస్తామని చెప్పారు. 3 వేల మంది రాష్ట్ర పోలీసులు, 1800 మంది కేంద్ర పోలీసులు ఉన్నారు. 3 గంటల్లో 90 కోట్ల రూపాయలు పంచితే పొలీస్ లు ఏం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం ఒక ఉన్నతాధికారి ని నియమించి ఎన్నికలు జరపాలి. అని ఆయన డిమాండ్ చేశారు.


 తమ సంప్రదాయాలను  ఇష్టంగా ఆచరించారు...

ఇతరుల విశ్వాసాలను గౌరవించారు

ఇదే నా భారత దేశ గొప్పతనం...ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఈ వాస్తవిక కథ


తమ తమ మత ఆచారాలను ఇష్టంగా ఆచరించడం, ఇతర మత సోదరుల విశ్వాసాలను గౌరవించడమే అసలైన మత సామరస్యం. ఇది భారత దేశంలో మెండుగా కనిపిస్తుంది. రామ్ రామ్ జీ, అస్సలామ్ వాలైకుం భాయ్, ఓ పుత్తర్ కైసే హో, ఆమెన్ వంటి పలకులు నా భారతదేశానికి గొప్ప సిరులు. కానీ కొన్ని శక్తులు ఇటీవల మేం చెప్పింది పలికితేనే ఈ దేశంలో ఉంటారు. లేకుంటే దేశం విడిచి వెళ్లాలి అని మైనార్టీ వర్గాలపై చేస్తున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ నా దేశం ఇలాంటి వారితో నిండిలేదు. పరమత సహనం మెండుగా ఉండటమే కాదు ఇతర మతాల విశ్వాసాలను గౌరవించే ప్రజలే ఎక్కువగా ఉన్నారు. నా భారతదేశం గొప్పతనాన్ని తెలియజేసే వాస్తవ కథ మీ కోసం. 


అది పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లా భలూర్ గ్రామం. అక్కడ హిందూ, సిక్కు, ముస్లిం  కుటుంభాలు నివసిస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే ఆ గ్రామంలో నివాసముంటున్నది నాలుగు ముస్లిం  కుటుంభాలే. ఈ గ్రామంలో ఏడు దేవాలయాలు,  రెండు గురుద్వారాలు ఉన్నాయి. గ్రామంలోని నాలుగు ముస్లిం కుటుంభాలు నమాజు చేసుకోవడానికి అక్కడ మసీదు లేదు. దేశ విభజనకు ముందు ఆ గ్రామంలో ఉండే మసీదు కాస్త శిథిలావస్థకు చేరుకొంది. ఈ వాస్తవ పరిస్థితి గ్రహించి ఆ గ్రామంలోని హిందూ, సిక్కు సోదరులు తమ ముస్లిం సోదరుల నమాజు చేసుకోవడానికి కనీసం తమ గ్రామంలో మసీదు లేదే అన్న చింతన వారిలో కలిగింది. ఓ రకంగా చెప్పాలంటే వారిలో నాలుగు ముస్లింల  కుటుంభాల  పట్ల  సోదర ప్రేమ కలిగింది. దీంతో గ్రామ మంతా ఓ అభిప్రాయానికి రావడం కారణంగా ఆ గ్రామ సర్పంచ్ పాల సింగ్ ఓ ప్రకటన చేశాడు. ఆ ప్రకటన సాదాసీదామైనది కాదు, నేటి తరానికి స్పూర్తినిచ్చే ప్రకటన  చేశాడు. ఎవరి విశ్వాసాలను వారు ఆచరించేందుకు వారి వారి ప్రార్థనా మందిరాలున్నాయి. కానీ మన గ్రామంలోని నాలుగు ముస్లిం  కుటుంభాలకు ప్రార్థన చేసేందుకు మసీదు లేదు. గ్రామంలోని అన్ని వర్గాల  వారు తమ తమ ప్రార్థనా మందిరాలు కలిగివుండాలని గ్రామస్థులంతా కోరుకొంటున్నారు. కాబట్టి శిథిలావస్థకు చేరుకొన్న మసీదు స్థలంలోనే కొత్త మసీదు నిర్మించాలని కోరుకొంటున్నాం. అందుకే అక్కడ కొత్త మసీదు నిర్మించాలని మేం నిర్ణయించామని ఆ గ్రామ సర్పంచ్ పాల సింగ్ ప్రకటించారు. అంతేకాదు ఆ మసీదు నిర్మాణానికి  ఆ గ్రామంలోని హిందూ, సిక్కు, ఇతర వర్గాల ప్రజలు తమ తహత్తును బట్టి వంద రూపాయల నుంచి లక్ష రూపాయల  వరకు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. మన రాజకీయ నేతల ఇచ్చే హామీలాగా ఆ గ్రామ సర్పంచ్ ప్రకటన హామీల్లాగే ఉండిపోలేదు.  ఆ సర్పంచ్ ప్రకటన వెంటనే కార్యరూపం దాల్చింది. మసీదు నిర్మాణానికి పునాది పడింది. ఈ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ గ్రామంలోని అన్ని మతాల ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు  చేశారు. అక్కడి సాంప్రదాయ  మిఠాయి జిలేబీ  పంచుకొని గ్రామస్థులంతా తమ ఆనందాన్ని పంచుకొన్నారు.  మత సామరస్యం అంటే ఇదే అని నేటి సమాజానికి చాటి చెప్పారు. మన దేశ ఐక్యత, పరమత  సహనం, భినత్వంలో ఏకత్వం గొప్పతనాన్ని మరోసారి తెలియజేసే ఉద్దేశంతో ఈ  చిరు వాస్తవ కథ మీ అందరి కోసం.


 పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ...

సీపీఎం, సీపీఐ, ఎంపీజే ఆధ్వర్యంలో రాస్తారోకో


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

హద్దు,అదుపు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఆటో వర్కర్స్ యూనియన్(ఎఐటియుసి) సీపీఐ, సిపిఎం, యంపీజె ల ఆధ్వర్యంలో నేడు కోర్టు సెంటర్ లో రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో ప్రదర్శన కూడా నిర్వహించారు.

ఎఐటియుసి నాయకులు అందె నాసరయ్య
 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి అందే నాసరయ్య, జిల్లా ఎఐటియుసి కార్యదర్శి ఎస్ కె కాశిం,సిపిఎం పట్టణ కార్యదర్శి డి.సోమయ్య, నాయకులు డికెయం రఫీ, డివైఎఫ్ఐ పశ్చిమ ప్రకాశం అధ్యక్షులు ఏనుగులు సురేష్,ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఏలూరి వెంకటరెడ్డి,యంపీజే రాష్ట్ర కోశాధికారి ఎస్ కె అబ్దుల్ రజాక్(బాబు) తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో సందర్భంగా కోర్టు సెంటర్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఆందోళన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అల్లావుద్దీన్ పర్యవేక్షించారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్