రాళ్ళ దాడిని త్రీవ్రంగా ఖండిస్తున్నాను

మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైస్సార్సీపీ అల్లరి మూకలు రాళ్ల, కర్రలు, ఇనుపరాడ్లతో దాడిని త్రీవ్రంగా ఖండిస్తున్నాం. " నిన్న రాష్ట్ర మాజీ మంత్రి వెనుకబడిన వర్గానికి చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రిని ప్రజా సమస్యల పైన బహిరంగంగా ప్రశ్నించారు. ఒక బీసీ గొంతుక ప్రజలకు చేరకుండా ప్రతిపక్ష నాయకులు పైన దాడి చేయటం  బీసీల పైన దాడిగానే భావిస్తున్నాము. " అయినా వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష నేత కు భద్రత కల్పించ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఎక్కడుందని,
ఈ సందర్భంగా ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత  ఉన్న ప్రతిపక్ష నేత ఇంటి పైకి వైస్సార్సీపీ గూండాలు రాళ్లు, కర్రలతో ఇనుపరాడ్లతో దాడిచేసి తెదేపా శ్రేణులపై  విచ్చలవిడిగా దాడులు చేశారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయా ఒక సారి ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా వారు మాట్లాడుతూ ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన జోగి రమేష్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ చర్చకు  రమ్మంటావా... నువ్వెంత నీ బ్రతుకెంత. నీ స్థాయి ఏంటో ముందు తెలుసుకో. నీ  స్థాయికి మా పార్టీలో  మాలోఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధం, నీవు దానికి సిద్ధమేనా" అని సవాల్ విసిరారు. ఒక ప్రతిపక్ష నేత ఇంటి పైకి  అధికార పార్టీ  రౌడీ MLA  అయిన జోగి రమేష్ తన   అనుచరులైన ఐదు వందలమంది అల్లరిమూకలతో ఈరాష్ట్రాన్ని పధ్నాలుగు సంవత్సరాలు పాలించిన ప్రతిపక్ష  నేత ఇంటి పైకి దాడికి వెలుతూంటే ఈ రాష్ట్ర పోలీసులకు కనబడడం లేదా అని ఈ సందర్భంగా తెదేపా తరపున ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏదయినా ప్రజా ఉద్యామాలు చేపట్టాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కోవిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 ,30  యాక్టు పేరుతో తెదేపా నాయకులను కార్యకర్తలను అడ్డుకొంటారు.ఈరోజు  MLA జోగి రమేష్  తన అనుచరులైన ఐదు వందలమంది రౌడీ మూకలతో తిరుగుతూ తెదేపా శ్రేణులపై దాడులు,దౌర్జన్యం చేస్తుంటే అక్కడున్నటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ.. వైసీపీ అల్లరి మూకలకు వత్తాసు  పలకడం దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము.తక్షణమే చంద్రబాబు ఇంటిపైన దాడికి ఉసిగొల్పిన MLA జోగి రమేశ్ ను  తక్షణమే అరెస్ట్ చేయాలి,  అదేవిధంగా అక్కడ ఉన్న తెదేపా శ్రేణులపై దాడి చేసిన వైసీపీ అల్లరి మూకలను వెంటనే హత్యాయత్నం క్రింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వీరందరి పై చర్యలు తీసు కోలేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో ఉన్న 70 లక్షల క్రియాశీల తెలుగుదేశం కార్యకర్తల ప్రతిఘటన చూస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని  హెచ్చరించారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మార్కాపురం మాజీ ఏఎంసీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, మార్కాపూర్ పట్టణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు , 33 వ వార్డు కౌన్సిలర్ నాలి  కొండయ్య, మాజీ కౌన్సిలర్ సయ్యద్  గఫార్, తెలుగుదేశం నాయకులు పటాన్ ఇబ్రహీం, తాండ్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: