ప్రజలను తపుదోవ పట్టించేలా వైసీపీ వ్యాఖ్యలు
కందుల నారాయణ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
వెలుగొండ ప్రాజెక్టుపై వైసిపి మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వున్నాయని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విమర్శించారు. మొదటి టన్నల్ పూర్తయింది, పునరావస ప్యాకేజిలు కూడ మొదలు పెట్టామని మభ్యపెడుతున్నారన్నారు. మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం లోని ప్రెస్ క్లబ్లో వెలిగొండ ప్రాజెక్టు అంశం మీద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకవేళ పూర్తయిందన్న మొదటి టన్నల్ ద్వారా నీరు ఎందుకు నల్లమల సాగరుకు సరఫరా చేయటంలేక పోయారని ప్రశ్నించారు. గతంలో మా ప్రభుత్వము వచ్చిన మొదటి సంవత్సరములోనే పూర్తి చేస్తామన్న మీరు, యిప్పటికీ రెండున్నర సంవత్సరాలు గడిచిన పూర్తిచేయలేక పోవటం మీ చిత్త శుద్ధి కనిపిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మార్కాపూర్ మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, మార్కాపురం ఏఎంసి మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, 33 వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య, మాజీ కౌన్సిలర్ సయ్యద్ గఫార్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు డాక్టర్ మౌలాలి, పట్టణ తెలుగు దేశం మైనారిటీ నాయకులు పటాన్ ఇబ్రహీం, మండల తెలుగుదేశం నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: