కేటీఆర్ పై కేసు నమోదు చేయండి

డీజీపీకి కాంగ్రెస్ నేత జీ నిరంజన్ లేఖ

(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)

నిన్నటి రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి కి ప్రేరేపించిన కెటిఆర్ పై కేసు నమోదు చేసి విచారణ జరిపించండి అని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజన్ డిమాండ్ చేశారు. ఈమేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశం ఇలా ఉంది....ఈ నెల 7వ తేదీన జలవిహార్ లో జరిగిన టిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశములో కాంగ్రెస్ నాయకుల పై దాడి చేయమని కార్యకర్తలను రెచ్చగొడ్తూ కెటీఆర్ చేసిన ప్రసంగమే నిన్నటి దాడికి ఉసిగొలిపినది.  నిన్నటి దాడికి పూర్తి భాధ్యత కెటిఆర్ దే.

నిన్నటి దాడి తెలంగాణా ప్రజలను షాక్ కు గురి చేసింది. కెటిఆర్ పై చర్యలు తీసుకుని కట్టడి చేయకుంటే రాష్ట్రములో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదమున్నది. ఆ సమావేశములో కెటిఆర్ చేసిన ప్రసంగ వివరాలు ప్రచు రితమైన 8 సెప్టెంబరు నాటి పత్రికల క్లిప్పింగ్ లను డి.జి.పి కి రాసిన లేఖకు జత పర్చడమైనది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: