చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే..
అయ్యన్నపాత్రుడిని ప్రేరేపించింది చంద్రబాబే..
ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడితే ఊరుకోం.. -
ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ & వైసీపీ అనంతపురంపార్లమెంట్ అధ్యక్షులు నదీమ్అహ్మద్
అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయ్యన్నపాత్రుడిపై కేసు పెడుతున్న వవైసీపీ నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-అనంతపురం ప్రతినిధి)
రాష్ట్రంలో అరాచకాలు, అల్లర్లు సృష్టించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని, అయ్యన్న పాత్రుడి మాటలకు కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబేనని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ &వైయస్ఆర్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు నదీమ్ అహ్మద్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయ్యన్నపాత్రుడి మీద కేసు పెట్టి, మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే.. అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, మంత్రి వర్గ సభ్యులను, దళిత మహిళా హోంమంత్రిని కూడా బండభూతులు తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ, అయ్యన్న మాటలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని నదీమ్ అహ్మద్ డిమాండ్ చేశారు. అలానే ‘‘తెలుగుదేశం పార్టీ తాబేదారు పచ్చ పత్రికలు కూడబలుక్కొని' 'చంద్రబాబు ఇంటి మీద దండయాత్ర’ అనే హెడ్డింగ్లతో బాబుకు వత్తాసు పలికారు. కనీసం పశ్చాతాపం కూడా లేకుండా సభ్యసమాజం తలదించుకునే విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. కనీసం పత్రికలు కూడా రాయలేని భాషలో మాట్లాడారు. ముఖ్యమంత్రిని బండభూతులు తిడుతుంటే చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో నిరసన తెలియడానికి చంద్రబాబు ఇంటికి వెళ్తుంటే ఎమ్మెల్యే వాహనాల మీద రాళ్లు వేయించి, కారు ధ్వంసం చేయించి, ఎమ్మెల్యే మీద దాడి చేయించారు.
రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని చంద్రబాబు చేస్తున్న వైనాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటల మీద చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే. సభ్యసమాజం తలదించుకునే విధంగా అయ్యన్న మాట్లాడిన మాటలు, రెచ్చగొట్టే కార్యక్రమానికి టీడీపీ తెరతీస్తుంది. దీన్ని మార్చుకోకపోతే తగిన శాస్తి జరుగుతుంది. రేపు వెలువడబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు చెంపచెల్లుమనించేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక.. పెడదారి పట్టించాలనే ఆలోచనలతో డ్రామాలు చేస్తున్నారు. బుద్ధిని, భాషను సరిచేసుకోకపోతే చంద్రబాబు ఎక్కడ పర్యటిస్తే అక్కడ నిరసన తెలియజేస్తాం. భాషను సరిచేసుకునే వరకు వెంటపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్ర రెడ్డి, వైసీపీ మహిళ విభాగం అనంతపురం అధ్యక్షురాలు గిరిజమ్మ, మైనార్టీ విభాగ పార్లమెంట్ అధ్యక్షులు గయాజ్ బాషా(మున్నా), వైసీపీ ఐటి విభాగం రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ యాదవ్, ఎస్టీ సెల్ నగరాధ్యక్షులు గుజ్జల శివయ్య, మైనార్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమ్మూరు నిజాముద్దీన్, విద్యార్ధి విభాగ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్, 10వ డివిజన్ నాయకులు శ్రీరాములు, 50వ డివిజన్ కన్వీనర్ మహబూబ్ బాషా, శ్రీనివాసుల రెడ్డి, పాతవూరు ఆకుల తబ్రేజ్, చాంద్, షకీల్, రాజు, హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర కార్యదర్శి గురుప్రసాద్, కేశవ, దాదు, రూఫా మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ విభాగ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: