జగనన్న విద్యా దీవెనను నేరుగా,,,
కళాశాల అకౌంట్ లోనే జమ చేయాలి
ఏపీ హైకోర్టు ఆదేశాలు
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
జగనన్న విద్యా దీవెన విద్యార్థుల తల్లి ఖాతాలో వేయాలని గతంలో ఇచ్చినటువంటి జీవో ని కొట్టివేస్తూ ఆ నగదును నేరుగా కళాశాల ఎకౌంట్ లోనే వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో డబ్బు జమపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లోనే జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును విన్నవించారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిగింది. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా దీవెన మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇకపై, జగనన్న విద్యా దీవెన డబ్బు.. విద్యార్థులు తల్లుల అకౌంట్లలో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్తుందా? లేక అమలు చేస్తుందా అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: