వెలిగొండ ద్రోహి చంద్రబాబు.. ఆయన మాటలు నమ్ముతారా? 

*వచ్చే ఏడాది వెలిగొండ ద్వారా నీరు ఇస్తాం

*ప్రాజెక్టుకు అటవీ అనుమతులు తెచ్చింది వైఎస్ఆర్..

వైసీపీ రాష్ట్ర నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

టీడీపీ నేతలకు ఎన్నిసార్లు చెప్పినా వెలిగొండ ప్రాజెక్టు మీద దుష్ప్రచారం మానడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. మొదటి సొరంగం పనులు పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా 9.5 డయామీటర్‌తో రెండవ సారంగ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలో రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుందని చెప్పారు. అయితే ఈలోపే టీడీపీ నేతలు దీనిని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రాజెక్టు పునరావాసం కింద ప్రతి నిర్వాసితుడికి రూ.12 లక్షల యాభై వేలరూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుందని.. అందుకోసం ప్రస్తుతం సర్వే జరుగుతోందని ఏలూరి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఫారెస్టు క్లియరెన్స్ తెచ్చింది టీడీపీ ప్రభుత్వం అన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను  తీవ్రంగా తప్పుబట్టారు ఏలూరి..
వెలిగొండ పనులకోసం మహానేత వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 లో అటవీ అనుమతులు ఇవ్వాలని NGT కి అప్లికేషన్ పెట్టుకుంటే 2007 లో తుది అనుమతులు వచ్చాయని గుర్తుచేశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం నిజాలు కప్పిపుచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వానికి వెలిగొండ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే నిర్వాసితులకు ముందుగానే పునరావాసం ఏర్పాటు చేశామన్నారు. ఇదిలావుంటే వెలిగొండ కేంద్ర ప్రకటించిన గెజట్‌లో లేదని టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించిన ఏలూరి.. ఈ ప్రాజెక్టుకు అన్నివిధాలుగా కేంద్రం సహకరించేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రితో మాట్లాడగా తదుపరి గెజిట్ నోటిఫికేషన్లు చేర్చుతామని హామీ ఇచ్చిన విషయాన్ని ఏలూరి ప్రస్తావించారు. వెలిగొండ మీద అంత ప్రేమ ఒలకబోస్తున్న టీడీపీ గత ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా నిర్మాణాన్ని ఎందుకు పూర్తిచేయలేదని రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వెలిగొండను కట్టకుండా నిర్లక్ష్యం చేసిన ద్రోహి చంద్రబాబు.. అలాంటి వ్యక్తిని పశ్చిమ ప్రకాశం ప్రాంత నేతలు వెనకేసుకురావడం చారిత్రాత్మక తప్పిదం అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: