చెత్త బుట్టల కు డబ్బులు వసూళ్లా...?
సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోండి
జానోజాగో సంఘం నేత సయ్యద్ మహబూబ్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
మున్సిపల్ శాఖ తరఫున పంపిణీ చేసిన చెత్త బుట్టల కు నంద్యాల పట్టణంలోని 9వ వార్డు సచివాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై మున్సిపల్ కమిషనర్ తగుచర్యలు తీసుకోవాలని జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన నంద్యాల మున్సిపల్ కమిషనర్ కు తొమ్మిదో వార్డులోని ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ లోని తొమ్మిదో వార్డు లో సచివాలయ సిబ్బంది, వాలంటరీ లు రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి మూడు చెత్తబుట్టలో ఉచితంగా అందిస్తూ ఉంటే నంద్యాల మున్సిపాలిటీ లోని 9వ వార్డు సచివాలయ సిబ్బంది మూడు చెత్త బుట్టలు కలిపి 30 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. చెత్త బుట్టలు డబ్బులు కట్టి తీసుకోకపోతే మీ రేషన్ కార్డు తీసి వేస్తామని వారు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలా బెదిరించి సచివాలయ సిబ్బంది వార్డు ప్రజలందరినుంచి డబ్బులు వసూలు చేశారన్నారు. ఈ విషయంపై నంద్యాల మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారని సయ్యద్ మహబూబ్ బాషా తెలిపారు. మున్సిపల్ కమిషనర్ 9వ వార్డు సచివాలయ సిబ్బంది పై తగు చర్య తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: