మౌలానా కలీమ్ సిద్ధిఖీని,,,

బేషరుతుగా వెంటనే విడుదల చేయాలి

:జమాఅతె ఇస్లామి హింద్ మార్కాపురం శాఖ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)

మౌలానా కలీమ్ సిద్ధిఖీని బేషరుతుగా వెంటనే విడుదల చేయాలని :జమాఅతె ఇస్లామి హింద్ మార్కాపురం శాఖ డిమాండ్ చేసింది.స్థానిక చిన్న మసీదు ప్రాంగణంలో మార్కాపురం జమాఅతె ఇస్లామి హింద్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పట్టణ కార్యకర్తల సమావేశంలో పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా జమాఅతె ఇస్లామి హింద్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు అష్రఫ్ అలీ మాట్లాడుతూ మౌలానా కలీమ్ సిద్ధిఖీని ఉత్తరప్రదేశ్ ఎటిఎస్ అరెస్టు చేసిన వార్త దేశ పౌరులందరికీ ఆందోళన కలిగించే విషయమని మౌలానాపై వేసిన ఆరోపణలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, ఆయనని వెంటనే విడుదల చేయాలని మరియు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

మౌలానా కలీమ్ సిద్ధిఖీ ముస్లింలలోనే కాకుండా ముస్లిమేతర సమాజంలో కూడా గౌరవనీయ వ్యక్తి. మౌలానా ను  అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వాదులకు తీవ్ర ఆవేదనకు గురి చేశాయని, ఈ అరెస్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై అనుమానాలకు దారితీసిందని, ఉత్తరప్రదేశ్ లో రానున్న ఎన్నికల సందర్భంలో హిందూ-ముస్లింల మధ్య  ద్వేషాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక దుర్మార్గమైన ప్రయత్నంగా అభివర్ణించారు.

        అదేవిధంగా మరో వైపు అస్సాం లో మొయినుల్ హాక్ పై జరిగిన సంఘటన ప్రజాస్వామ్య వాదులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మొయినుల్ హాక్ మరణం ఖచ్చితంగా ప్రభుత్వ హత్యగా పరిగణించాలని, దీనికి అస్సాం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించాలనీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతి రోజు ఎక్కడో చోట కొన్ని శక్తులు రాజకీయ లబ్ధి కోసం తమ ఉన్మాద చర్యల్ని అమాయకులపై చూపుతూ తమ ఓటు బ్యాంకు ను పెంచుకోవడానికి  ప్రయత్నించడం సిగ్గు చేటు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జమాఅతె ఇస్లామి హింద్ పట్టణ ఉపాధ్యక్షులు సికిందర్,కార్యదర్శులు అజీజ్,గఫార్ ఖాన్,మొహమ్మద్ ఖాన్ కార్యకర్తలు సలీం,నజీర్,హబీబ్ ఖాన్,ఖాసింబాష,రసూల్ తదితరులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: