పండిట్ కోర్స్ లో ఉర్దూకు అవకాశమివ్వండి
ఉర్దూను పరిరక్షించండి
నంద్యాల ముస్లీం జేఏసి
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
నిన్న ఆ.ప్ర రాష్ట్ర ప్రభుత్వం పండిట్ కోర్సులకు దరఖాస్తులు కోరుతు నోటిఫికేషన్ జారీచేసింది అయితే అందు ఉర్దూ భాష విస్మరించడం శోచనీయమని నంద్యాల ముస్లీం జేఎసి కన్వీనర్ మరియు జమాఆతె ఇస్లామి అధ్యక్షులు ప్రభుత్వ ప్రకటనలను తీవ్రంగా ఖండించారు. సమద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉర్దూ భాష పై సవతి తల్లి ప్రేమ చూపుతుందని రాష్ట్రంలో పది శాతం ప్రజలకు మాతృభాష అయిన ఉర్దూ అధ్యయనానికి అవసరమైన ఉర్దూ పండిట్ కోర్సుకు ఎందుకు నోటిఫీకేషన్ ఇవ్వలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేసారు.
తెలుగు, హిందీ భాషల్లో బీఈడీ ఉన్న పండిట్ కోర్సులకు ధరాస్తులు కోరితే ఉర్దూకు కోరుకపోవడం విడ్డూరంగా ఉందనీ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉర్దూ పండిట్ కోసం నోటిఫీకేషన్ ఇవ్వాలనీ సమద్ డిమాండు చేసారు. ఇమాం హాఫీజ్ ముహమ్మద్ సలీం పర్వేజ్ మాట్లాడుతూ ఉంది ఉర్దూ అందరి భాషగా దేశవిదేశాల్లో అలరిస్తుందని, దాని మాధుర్యం అందరం ఆస్వాదిస్తారనీ, రాష్ట్ర విభజన తరువా ఉర్దూ భాషకు అదోగతి పట్టించారన్నారు. ఉర్దూ పండిట్ నోటిఫికేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తుంటే వాళ్ళ ఆశలు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్షం చేసిందన్నారు. ఉర్దూ అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఉర్దూ పండిట్ కోర్సులకు సైతం వెంటనే ప్రకటన ఇవ్వాలన్నారు. జేఏసి కోకన్వీనర్ ముహమ్మద్ అబులైస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ టీచర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. కాంగ్రేస్ మస్తాన్ ఖాన్,హఫీజ్ ఫిరోజ్,మార్కెట్ షరీఫ్ పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: