శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ,,,
సాధన దీక్ష లో భాగంగా కాగడాల ప్రదర్శన,,,
భారీ ఎత్తున పాల్గొన్న టిడిపి శ్రేణులు
(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)
ఇటీవల తెలుగుదేశం ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలసి తక్షణమే శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కేంద్ర జల శక్తి సంఘం గజిట్ లో చేర్చాలని ముక్తకంఠంతో కోరారు. అనంతరం శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై నియోజకవర్గ ప్రజలను చైతన్య పరచుటకు వెలిగొండ సాధన దీక్ష .. కాగడాల ప్రదర్శన అనే కార్యక్రమాన్ని ఈరోజు తర్లుపాడు మండలం తాడి వారి పల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తాడి వారి పల్లి గ్రామంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ
ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని రాయలసీమ ప్రాజెక్టులకుక తరలించుట మీద ఉన్న శ్రద్ధ, శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పై లేదని తద్వారా ప్రకాశం జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు హయాంలో ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తద్వారా కృష్ణా డెల్టాకు 120 టీఎంసీ ల నీరు గోదావరి నుండి తరలించే వీలు కల్పించాలని తెలియజేశారు. అందువలన తక్షణమే శ్రీశైలంలో నిలువ చేయుచున్న ఆ 120 టీఎంసీల నీటిని వెలిగొండ ప్రాజెక్టు కు 42 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా వెలుగొండ ప్రాజెక్ట్ సాధన లో భాగంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య , మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి , మండల తెలుగుదేశం నాయకులు సానం వీరయ్య, పీ.గోపీనాథ్ చౌదరి , తాండ్ర వెంకటేశ్వర్లు చౌదరి, మాజీ కౌన్సిలర్ సయ్యద్ గఫార్, పఠాన్ ఇబ్రహీమ్, మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: