ఘనంగా వినాయక నిమజ్జనం

ఉత్సాహంగా పాల్గొన్న గ్రామ వాసులు(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా గడివేముల గ్రామం లో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. వినాయక నిమజ్జన కార్యక్రమం లో పిల్లలు యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా కష్టాలను తొలగించి గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా  బీసీ కాలనీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు టగ్గ ఫర్ , ఉట్టి కొట్టే పంద్యాలు యువకులకు టగ్గ ఫర్ మరియు ఉట్టి కొట్టే పందేలు నిర్వహించారు. గురువు బండి సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో లో చెక్కభజన మరియు భజన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజుల నుండి పూజలందుకున్న వినాయకుడు సోమవారం 6 గంటలకు స్థానిక నదిలో నిమజ్జనం చేశారు. పిల్లలు పెద్దలు మహిళలు అందరూ రంగులు చల్లుకుంటూ ఎంతో ఉల్లాసంగా వినాయక నిమర్జనం లో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్ఐ శ్రీధర్, పోలీసు బృందం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

     


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: