ఘనంగా గణనాథుని శోభాయాత్ర 

శ్రీ గణేష్ నిమజ్జన శోభాయాత్ర పాల్గొన్న,,,

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


(జానోజాగో వెబ్ న్యూస్-కోదాడ ప్రతినిధి)

కోదాడ పట్టణ కేంద్రంలోని వర్తక సంఘం బజార్ లో  వినాయక మాండపం వద్ద పూజలు నిర్వహించి, లడ్డు వేలం పాటలు ప్రారంభించారు, 25 వేల తో మొదలైన లడ్డూ వేలం పాట లక్షా 26 వేల రూపాయలకు రఘు కైవసం చేసుకున్నారు. అనంతరం గణేష్ నిమజ్జన శోభాయాత్ర ను ప్రారంభించిన  కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిదేవుడు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని అని అన్నారు. విఘ్నాలు తొలగిపోయి నిర్విఘ్నంగా కార్యాలు విజయవంతం కావాలని అని ఆయన కోరారు. ఈ కోదాడ నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా పాడిపంటలతో వర్ధిల్లాలని ఆ విధంగా భగవంతుడి అనుగ్రహం ఉండాలని ఆయన కోరారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి నుండి మానవాళిని రక్షించాలని ఆ భగవంతుని కోరారు. ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరూ మొదలుపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కావాలని అన్నారు. 19వ వార్డులో నవరాత్రులను పురస్కరించుకుని చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించిన మన కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు రోజా రమణి, తదితరులు పాల్గొన్నారు. స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో గణేష్ శోభాయాత్ర  సందర్భంగా భక్తులకు ఉచితంగా స్వీట్స్ హ్యాండ్ మినరల్ వాటర్ పంపిణీ సెంటర్లను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంధంశెట్టి శ్రీనివాస రావు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యబాబు, టిఆర్ఎస్ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


 

 32 వ వార్డు లో శ్రీ క్రిష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు శోభాయాత్ర ప్రారంభోత్సవానికి కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ గుండెల సూర్యనారాయణ మాదాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

 కోదాడ పట్టణంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ కిషోర్ కుమార్ ,గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు యదా రమేష్, నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, రామారావు, నూనె సులోచన, మేకల శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు. కోదాడ పట్టణం 9వ వార్డులో గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్ర ప్రారంభించిన మన కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మదర్ తదితరులు పాల్గొన్నారు. 

కోదాడ పెద్ద చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు 

కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను నిర్వహించామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. నిమర్జనంకి సంబంధించిన ట్రైను, బార్ గేట్లను, గజ ఈతగాళ్ళు, వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది లను భక్తులకు అందుబాటులో ఉంచి ఎటువంటి ఇబ్బందులు అనుకుంటా సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు స్థానాలు చేయడానికి స్థాన వాటికలను ఏర్పాటు చేశామని తెలిపారు. కోదాడ పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం భక్తులతో కలిసి ఆడిపాడిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎంపీపీ కవిత రాధ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మ మధుసూదన్,  టిఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, ఒంటిపులి నాగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షులు  నాగేశ్వరరావు  సెక్రటరీ గట్ల కోటేశ్వరరావు, గ్రంధాలయ చైర్మన్ రహీం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, ఉపేందర్ తాజుద్దీన్, ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: