విఘ్నాలు తొలగించే పండుగపై ఆంక్షలా

మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

విఘ్నాలు తొలగించే పండుగపై ఆంక్షలా అంటూ వైసీపీ ప్రభుత్వంపై మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏ కార్యక్రమం నిర్వహించినా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలంటూ విఘ్నేశ్వరుడు పూజ నిర్వహిస్తామని, అలాంటి వినాయకచవితి పండుగ నిర్వహించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మూర్ఖ‌త్వ‌మేన‌ని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో కుల, మత విద్వేశాలను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. దేవుడుతో ఆటలాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. వినాయకచవితి ఉత్సవాలు జరుపుకోవడం హిందూ సంస్కృతి, సాంప్రదాయమని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పండుగపై ఆంక్షలు లేవని, కేవలం ఏపీలోనే పండుగ న్విహించొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం కుల, మతాల మధ్య విద్వేసాలను రెచ్చగొట్టడమేమని చెప్పారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. మాజీ సీఎం వైఎస్ వర్ధంతి సభను ఇడుపులపాయతోపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీగా కార్యక్రమాలు నిర్వహించారని, అపుడు కరోనా ఉన్న విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కరోరా ఉదృతి ఉన్నందున స్కూళ్లు తెరవద్దని తల్లిదండ్రులు కోరినపుడు ఎందుకు పట్టించుకోలేదన్నారు. మద్యం దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అబద్దాలు చెబుతూ కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ప్రజలను మోసం చేస్తూ కాలక్షేమం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని, అలాగే అన్ని రంగాల్లోనూ కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ ప్రజలలో చర్చ జరగకుండా ఉండేందుకే వినాయకచవితి పండుగ నిర్వహణపై ఆంక్షలు విధించారని తెలిపారు. మరోవైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దొంగే దొంగా దొంగా అన్నట్టు మత తత్వాన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు జవ్వాది రామానుజుల రెడ్డి, మార్కాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, తెలుగుదేశం మైనారిటీనాయకులు పఠాన్ ఇబ్రహీమ్, గఫార్, గులాబ్, కొప్పుల శ్రీనివాసులు, తాండ్ర వెంకటేశ్వర్లు చౌదరి తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: