వినాయక చవితి ఉత్సవాలకు

అనుమతించాలి అంటూ బీజేపీ నిరసన


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు మార్కాపురం లో  సోమవారంనాడు ఆర్.డి.ఓ. ఆఫీస్ ఎదురుగా బి.జె.పి. రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పి.వి.క్రిష్ణారావు ఆధ్వర్యములో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ.అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు గారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపు కోవడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిమిషన్  ఇవ్వకపోవటం చాలా దుర్మార్గపు చర్య అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


  హిందూ దేశంలో హిందువులు తరాలుగా చేసుకున్నటువంటి వినాయకచవితి హిందూ పండుగలన్నీ కూడా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు. జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలకు సమర్థిస్తారా ఏ విధంగా మార్కాపురం నియోజకవర్గంలో హిందువులని వినాయకచవితి జరుపుకోవలో, వద్దో  స్థానిక శాసనసభ్యుడు నాగార్జున రెడ్డి  అభిప్రాయాన్ని తెలియజేయాలి

బి.జె.పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.క్రిష్ణారావు
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులు మీకు ఓటు వేసిన హిందువుల  మనోభావాల్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్క హిందువు కి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శాసనాల సరోజినీ మరో సీనియర్ నాయకుడు పైడిమర్రి శ్రీనివాసులు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఖమ్మం వెంకటరమణ బిజెపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు  చంద్ర శేఖర్ సమాచార హక్కు జిల్లా కన్వీనర్ సింగర సత్యనారాయణ కిసాన్మోర్చా పట్టణ అధ్యక్షులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 

 బి.జె.పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: