సివిల్ సర్వీసులపై ముస్లిం సమాజం దృష్టిసారించాలి

పోటీని ఎదుర్కొనేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అవసరమే

యూపీఎస్సీలో క్షీణిస్తున్న ముస్లింల ఉతీర్ణత

గతానికంటే ప్రస్తుతం ఉతీర్ణత తగ్గుదల

మొత్తం 761 మందిలో 31 మంది ముస్లిం అభ్యర్థుల ఉతీర్ణత


వడించేవాడు మనోడైతే ఏ బంతిలో  కూర్చున్న మనకు దక్కాల్సింది దక్కుతుంది. ఇది ఇప్పటికీ వాడుకలో ఉన్న సామెత. అంటే పరిపాలనలో కీలకమైన స్థానాల్లో తమ వారుంటే దక్కాల్సిన ప్రతిఫలాలు దక్కుతుంటాయన్నది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఈ సామెతను ముస్లిం సమాజం కూడా తేలికగా తీసుకోకూడదు. రాజకీయాల మొదలు  చట్టసభలు, బ్యూరోక్రసీ(పరిపాలన అధికార్లు) వ్యవస్థ వరకు  ముస్లింల  ప్రాతినిధ్యం శూన్యంగా మారుతోంది. అందుకే నేడు సమాజంలో ప్రభుత్వ ఫలాలు అందని ఏకైక  సమూహంగా ముస్లిం సమాజం నిలుస్తోంది. సగటు భారతీయుడిలా న్యాయం పొందాలంటే ముస్లింలు కూడా రాజకీయ, చట్టసభలతోపాటూ బ్యూరోక్రసీ వ్యవస్థలోనూ రాణించాలి. బ్యూరోక్రసీ వ్యవస్థలో కీలకంగా మారాలంటే మనకు ఉన్న ఏకైక మార్గం యూపీఎస్సీ ఎంపిక విధానమే. ముస్లిం జనాభాకు అనువుగా ఈ పోటీ పరీక్షల్లో ముస్లిం అభ్యర్థులు రాకపోగా పోటీ పరీక్షల్లో నిలిచే అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో రాణిస్తున్నది నామమాత్రంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం యూపీఎస్సీ తుది ఫలితాలు వచ్చాయి. వాటిలో ముస్లింల ప్రాతినిధ్యం గతానికంటే బాగా తగ్గింది. మొత్తం 761 మంది విజయవంతమైన అభ్యర్థులలో ముస్లిం అబ్యర్ధులు 4.07 శాతం ఉన్నారు. 

 2019లో 42 మంది ముస్లింలు పరీక్షలో ఉత్తీర్ణత సాధించగా, 2018 లో కేవలం 27 మంది ముస్లింలు మాత్రమే తుది ఫలితాన్ని సాధించారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం విజయవంతమైన ముస్లిం అభ్యర్థుల సంఖ్య తగ్గింది. ఇది ముస్లిం అభ్యర్థుల మరో నీరాశ  ప్రదర్శనగా చెప్పవచ్చు. దేశ జనాభా లో ముస్లిం జనాభా 15% ప్రకారం, సివిల్ సర్వీసులలో దామాషా ప్రాతినిధ్యం లో  120 కంటే ఎక్కువ మంది ముస్లిం అభ్యర్థులు ఉండాలి. ఈ సంవత్సరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన 31 మంది ముస్లింలలో ముగ్గురు అభ్యర్థులు  - సదాఫ్ చౌదరి (ర్యాంక్ 23), ఫైజాన్ అహ్మద్ (ర్యాంక్ 58) మరియు ధీనా దస్తగీర్ (ర్యాంక్ 63), విడుదల చేసిన జాబితాలో టాప్ 100 లో ఉన్నారు. సదాఫ్ చౌదరి ముస్లిం అభ్యర్థులలో మొదటి స్థానాన్ని సాధించారు. సదాఫ్ చౌదరి 23 వ ర్యాంకు సాధించారు. సదాఫ్ చౌదరి తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ఒక సాధారణ గృహిణి. సదాఫ్ ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంట్లో ఉండి అన్ని సన్నాహాలు చేసింది. సదాఫ్ ఇప్పుడు విదేశీ సేవలో చేరాలనుకుంటున్నారు. ఎంఎస్ ఐఏఎస్ అకాడమీకి చెందిన ఇద్దరు విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ ఇద్దరు విద్యార్థులు ఫైజాన్ అహ్మద్, మొహమ్మద్ హారిస్ సుమైర్ వరుసగా 58 మరియు 270 ఆల్ ర్యాంకులు సాధించారు. అయితే ముస్లిం  సమాజంలోని విద్యార్థులకు సైతం  వారిలో నైపుణ్య శిక్షణ పెంపొందించి వారిని యూపీఎస్సీ పరీక్షల వైపునకు ప్రోత్సహించే  చర్యలు మొదలవ్వాలి. ఆ దిశగా ముస్లిం స్వచ్చంద సంస్థలు, సంఘాలు ఆలోచన చేయాలి. అలాంటి నైపుణ్యతను పెంపొందించే శిక్షణా కేంద్రాల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి.

యూపీఎస్సీ 2020 లో ఎంపికైన ముస్లిం అభ్యర్థుల జాబితా 

1) ర్యాంక్ 23- సదాఫ్ చౌదరి

2)  ర్యాంక్ 58- ఫైజాన్ అహ్మద్

3)  ర్యాంక్ 63- ధీనా దస్తగీర్

4)  ర్యాంక్ 125- ఎండీ మంజార్ హుస్సేన్

5)  ర్యాంక్ 129- షాహిద్ అహ్మద్

6)  ర్యాంక్ 142- షహాన్సా K S

7)  ర్యాంక్ 203- మహ్మద్ ఆక్విబ్

8)  ర్యాంక్ 217- షహనాజ్ I

9)  ర్యాంక్ 225- వసీం అహ్మద్ భట్

10)  ర్యాంక్ 234- బుషారా బానో

11)  ర్యాంక్ 270- ఎండీ హారిస్ సుమైర్

12)  ర్యాంక్ 282- అల్తామాష్ ఘాజీ

13)  ర్యాంక్ 283- అహ్మద్ హెచ్. చౌదరి

14)  ర్యాంక్ 316- సారా అష్రఫ్

15)  ర్యాంక్ 389- మొహిబుల్లా అన్సారీ

16)  ర్యాంక్ 403- అనీజ్ ఎస్

17)  ర్యాంక్ 423- జెబా ఖాన్

18) ర్యాంక్ 447- ఫైసల్ రజా

19)  ర్యాంక్ 450- ఎస్ మొహద్. యాకూబ్

20)  ర్యాంక్ 470- సబీల్ పూవకుండిల్

21)  ర్యాంక్ 478- రెహాన్ ఖత్రి

22)  ర్యాంక్ 493- మొహమ్మద్ జావేద్ ఎ

23)  ర్యాంక్ 545- అల్టాప్ మహ్ద్. షేక్

24)  ర్యాంక్ 558- ఖాన్ ఆసిమ్ కిఫాయత్

25)  ర్యాంక్ 569- సయ్యద్ జాహెద్ అలీ

26)  ర్యాంక్ 583- షకీరాహ్మద్ తొండిఖాన్

27)  ర్యాంక్ 589- మొహమ్మద్ రిస్విన్

28)  ర్యాంక్ 597- ముహమ్మద్ సాహిద్

29)  ర్యాంక్ 611- ఇక్బాల్ రసూల్ దార్

30)  ర్యాంక్ 625- అమీర్ బషీర్

31)  ర్యాంక్ 738- మజిద్ ఇక్బాల్ ఖాన్


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: