సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఆ బాధ్యత సచివాలయాల సిబ్బందిపై ఉంది

జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ 

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయాల సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కంభం మండలం కందులాపురం, కంభం గ్రామ సచివాలయం, అర్ధవీడు మండలం కాకర్ల, నాగులవారం గ్రామాల సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు నిర్మిస్తున్న సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. సచివాలయాలలో హాజరుపట్టికలు, సంక్షేమ పధకాలకు చెందిన దస్త్రాలను ఆయన పరిశీలించారు. గృహ నిర్మాణ పధకం అమలు తీరుపై సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రైతుభరోసా కేంద్రాలలో ఎరువులు, పురుగుల మందుల నిల్వలను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార పదార్ధాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవల కోసం సచివాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కొన్ని సచివాలయాలలో వచ్చిన అర్జీలు పెండింగ్ లో ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకొనేది లేదన్నారు. మీ ఉద్యోగ బాధ్యతలు తెలుసుకొని పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు.

అర్జీల
జీల పరిష్కారంలో నిర్లిప్తత విడనాడాలని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోరుతూ సచివాలయాలకు వచ్చే ప్రజలకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇందుకోసమే సచివాలయాల సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని  గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యంగా భూముల ఆడిట్ చేపట్టాలన్నారు. సంక్షేమ పధకాలను లబ్దిదారులకు చేరవేయడంలో వాలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు.

మంచి
ంచి ఫలితాల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట మార్కాపురం ఆర్డిఓ కె. లక్ష్మీశివజ్యోతి, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్.సరళవందనం, ఉప కలెక్టర్   గ్లోరియా, జి తహసిల్దార్ ప్రసాద్, రవీంద్రారెడ్డి, ఎండిఓ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

 


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: