మంత్రి సురేష్‌పై తప్పుడు కూతలు... 

తాట తీస్తామంటూ ఏలూరి హెచ్చరిక


(జానో జాగో వెబ్ న్యూస్- విజయవాడ బ్యూరో)

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పై సిబిఐ కేసు నమోదు చేసినట్టుగా టీడీపీ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏలూరి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆదిమూలపు సురేష్ గారంటే గిట్టని కొంతమంది చిల్లర వ్యక్తులు ఇటువంటి దుష్ప్రచారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఎల్లో మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. చంద్రబాబు వేసే చిల్లరకోసం ఈ చానళ్ళు, ఆ పేపర్లు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతాయని.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక బాధ్యతగల మంత్రిపై ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. ఎప్పుడో కొట్టివేయబడిన కేసు ఇప్పుడు నమోదయినట్టుగా వక్రీకరించి మంత్రిని అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నారని.. అసత్య ప్రచారం చేసే వ్యక్తులు దమ్ముంటే తనతో  బహిరంగ చర్చకు రావాలని.. ఏలూరి సవాల్ విసిరారు

అసలుసలు సంబంధంలేని కేసులో మంత్రి సురేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చెయ్యడం టీడీపీ దివాలాకోరు తనానికి నిదర్శనం అన్నారు.. మర్యాదగా ఇలాంటి దుష్ప్రచారం చెయ్యడం మానుకోవాలని.. లేదంటే పరువు నష్టం పిటిషన్ దాఖలు చేస్తామని ఏలూరి  హెచ్చరించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తోన్న ఆదర్శ మంత్రిని బద్నాం చెయ్యాలని చూస్తే వారి తాట తీస్తామని ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: