మట్టి గణపతే.. మహా గణపతి
*పర్యావరణ హిత గణపతులు ప్రాధాన్యమిద్దాం..
*భవిశ్యత్ తరానికి అందమైన సమాజాన్ని ఇద్దాం..
వైసిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)
వినాయక చవిత ఉత్సవాలకు భక్తజనకోటి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సామాజిక బాధ్యతగా మట్టి గణపతినే పూజిద్దాం అంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన సమయమిదన్నారు ఏలూరి.. ప్రకృతిలో మమేకమవుతూ నేల-నీరు, చెట్టు - పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగమని. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం అని చెబుతూ. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతి విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలని భక్తులను కోరారు. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టిక్ వస్తువులతో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతోందని. ఈ పరిణామం వలన మరొకరికి ముప్పు వాటిల్లడం సమాజానికి అంత మంచిది కాదని ఆయన సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందన్న ఏలూరి.. వినాయక చవితి పండగ సందర్బంగా మట్టి గణపతి ప్రతిమలను ప్రధానం చేయనున్నట్టు ఏలూరి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మట్టి గణపతే.. మహా గణపతి అన్న ఆయన ప్రతి ఒక్కరు మట్టి గణపతినే పూజకు వినియోగించి తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
Home
Unlabelled
మట్టి గణపతే.. మహా గణపతి ,,, *పర్యావరణ హిత గణపతులు ప్రాధాన్యమిద్దాం.. *భవిశ్యత్ తరానికి అందమైన సమాజాన్ని ఇద్దాం.. వైసిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: