మైనారిటిల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం

సబ్ ప్లాన్ అమలు పట్ల హర్షం

జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు

రాష్ట్ర వైకాపా సెక్రటరీ యమ్ షంషీర్ అలీభేగ్ వెల్లడి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మైనారిటీల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యంగా ముస్లిం ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే సబ్ ప్లాన్ కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని రాష్ట్ర వైకాపా సెక్రటరీ మీర్జా షంషీర్ అలీభేగ్ అన్నారు. శనివారం ఆయన  మాట్లాడుతూ గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  ముస్లింలకు 4 శాతం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపితే నేడు రాజశేఖర్ రెడ్డి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైనారిటీ లకు సబ్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలచిపోయారని అయన గుర్తు చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వం  మైనారిటీలకు చట్ట సభల్లోను, కార్పొరేషన్ పదవుల్లోను పెద్ద పీట వేసిందని,అందులో భాగంగానే  శాసనసభలో నలుగురు ఎమ్మెల్యేలుగా, ముగ్గురు ఎమ్మెల్సీలను చేయడమేగాక మరో 11 మందికి కార్పొరేషన్ చైర్మన్ లుగా ఇంకా అనేకమందికి డైరెక్టర్లుగా అవకాశం కల్పించిందని ఆయన గుర్తుచేశారు. మైనార్టీల వర్గాల అభ్యున్నతికి కోసం నిరంతరం పాటుపడుతూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముస్లిం ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర వైకాపా సెక్రటరీ యమ్ షంషీర్ అలీభేగ్ అన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: