సమస్యల పరిష్కారం కోసం
ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి,,,గడపగడపకు “ సమస్యలు-పరిష్కారాలు”
హాజరైన రాజకీయ ప్రముఖులు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి శుక్రవారంనాడడు 28,29వ వార్డులలోని ప్రజల పలు సమస్యల పరిష్కారాలకై గడపగడపకు “ సమస్యలు-పరిష్కారాలు” అనే కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమములో రాజకీయ నాయకులతో పాటు పురపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి చాలవరకు డ్రైనేజి, మంచి నీరు, పలు కారణాలతో తీసివేసిన పెన్షన్లు, సచివాలయాల పనితీరు మొదలగు అనేక సమస్యలను ఎం.ఎల్.ఎ. నాగార్జున రెడ్డి దృష్టికి తెచ్చారు.
వెంటనే స్పందించిన ఎం.ఎల్.ఎ. సంబంధిత అధికారులను పిలిపించి ఈ సమస్యలను వంటనే పరిష్కరించాలని ,ఇకపై నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఎప్పుడూ మీకు అందుబాటులో వుంటానని ప్రజలకు భరోసా యిచ్చారు. ఈ కార్యక్రమములో మునిసిపల్ ఛైర్మన్ బాలమురళికృష్ణ, వైస్ ఛైర్మన్ షేక్. ఇస్మాయిల్, కమీషనర్ నయీమ్ అహమ్మద్, డి.ఇ. అబ్దుల్ సుభాని, శానిటరీ ఇనెస్పెక్టర్ నాయబ్ రసూల్, వార్డు కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: