మట్టి గణపతుల్ని పూజించండి..

పర్యావరణాన్ని కాపాడండి

డాక్టర్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

*ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణి


(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)

పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణకు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే  పూజించాలని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణి చేశారు. ట్రస్ట్ చైర్మన్ ఏలూరి గాలి వీరారెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు భక్తులకు మట్టి గణపతి ప్రతిమలను ప్రధానం చేసిన రామచంద్రారెడ్డి.. ఈ సందర్బంగా మాట్లాడుతూ..  పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు.. అలాగే పర్యావరణానికి ఎంతో చేయూతనిచ్చే మట్టి గణపతిని కాకుండా  విషపూరిత రంగులతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిషేధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మట్టి గణపతులనే వాడాలన్న ఆయన ఇలా చేయడంవలన మన తోపాటు రాబోయే తరాలవారు ఆరోగ్యాంగా ఉంటారన్నారు. ఇక గణపతి పూజకు, ఉత్సవాలకు యువత ఎంతో ఆసక్తి చూపుతారని ఆ యువతే సమాజం కోసం ఆలోచించాలని, ప్రతి ప్రాంతంలో మట్టి గణపతులనే ప్రతిష్టించాలని కోరారు. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఏలూరి రామచంద్రారెడ్డి సూచించారు. కాగా విగ్రహాల పంపిణి కార్యక్రమంలో పలువురు వ్యక్తులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: