అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను కాపాడండి
సెంట్రల్ బోర్డ్ కమిటీకి ఖలీఫాతుల్లా వినతిి
(జానో జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)
ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ వక్ఫ్ బోర్డు కమిటీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వా అధికార పర్యటనలో భాగంగా విజయవాడ అమరావతి కి వచ్చినా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సభ్యులు జనాబ్ నౌషాద్, జనాబ్ హనీఫ్ అలీ,శ్రీమతి మున్వారీ బేగం గార్లను శుక్రవారం నాడు విజయవాడలో బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షులు షేక్. ఖలీఫాతుల్లా బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్రo లో అన్ని జిల్లాలలో వక్ఫ్ బోర్డు ఆస్తులు చాలావరకు అన్యాక్రాంతం అవుతున్నాయని ఈ విషయములో విచారణ జరిపించి ఆస్తులను కాపాడాలని,జిల్లాలో వేరే కార్యాలయలలో
అనుభందముగా పనిచేసే విధంగా కాకుండా వక్ఫ్ బోర్డు స్వతంత్ర కార్యాలయాలు ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమిచాలని,వక్ఫ్ అధికారులు కు స్వతంత్ర నిర్ణయాలను జిల్లా స్థాయిలోతీసు కోనే అధికారాలను ఇవ్వాలని వారితో చర్చించి వినతి పత్రం ఇచ్చారు. ఈకార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. బాషా,బీజేపీ మైనారిటీ మోర్చా విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మౌలాలి.బీజేపీ మైనారిటీ నాయకులు ,వక్ఫ్ బోర్డు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: