నా జీవితాన్ని తీర్చిదిద్దింది

నా గురువే...ఓ శిష్యుడి మదిలో మాటగురువు

గురువు ఓనమాలు 

దిద్దించాడు  

పద్యాలు 

పలికించాడు 

రాగాలాపన 

చేయించాడు 

పదాల పదార్థాలు 

చెప్పాడు 

పాఠాల సారాంశం వివరించాడు 

బుద్ధులు సుద్దులు 

బోధించాడు  

లెక్కలు నేర్పించాడు 

సైన్స్ వివరించాడు 

హోంవర్క్ చేయించాడు 

మంచి చేవ్రాత 

రాయించాడు

మహానుభావుల 

జీవిత విశేషాలను వివరించాడు 

దేశ భక్తిని 

రంగరించి పోశాడు 

దేశాన్ని ప్రేమించడం 

నేర్పాడు 

గురువు 

వ్యాసాలు 

రాయించడం వల్ల 

వ్యాసకర్త నయ్యాను 

పాటలు 

పాడించడం వల్ల గాయకుడయ్యాను 

నాటకాలు 

వేయించడం వల్ల హీరోఅయ్యాను 

ఆటలు 

ఆడించడం వల్ల 

క్యాప్టెన్ అయ్యాను 

ఎన్నో చదువులు 

చదివాను 

చదువు అందలం 

ఎక్కిస్తుంది 

ధనం 

దొంగిలించబడుతుంది  

స్వార్థం ఉంది

తండ్రి లో 

తల్లిలో 

సోదరులలో 

అక్క చెల్లెళ్ళలో

 బంధువుల్లో 

స్నేహితుల్లో 

కొలీగ్ లలో 

స్వార్థం లేని చోటు లేదు నిస్వార్ధం కాగడా పెట్టి వెతికినా కానరాదు 

కానీ... కానీ... మా గురువు గారు ఒక్కరే 

నన్ను నిస్వార్ధంగా తీర్చిదిద్దింది ఆ నిస్వార్థపర గురువుకు ఉంటాను రుణపడి జీవితాంతం

రచయిత--మొహమ్మద్ అబ్దుల్ రషీద్

రచయిత,, అనువాదకులు...కవి-హైదరాబాద్

సెల్ నెం-98485-16163

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: