టీడీపీ కంచుకోటల్లో ఫ్యాన్ ప్రభంజనం

జగన్ పనితీరుకు నిదర్శనంగా పరిషత్ ఫలితాలు

వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

ఏపీ ప్రజలు మరోసారి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. నిన్న వెల్లడైన పరిషత్ ఫలితాల్లో వైకాపా భారీ విజయం సాధించడంపట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఏలూరి ధన్యవాదాలు తెలిపారు. గత స్థానిక ఎన్నికలు చూసినా, ఇప్పుటి ఫలితాలు చూసినా అదే ట్రెండ్‌ కొనసాగుతోందన్నారు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అన్నింటిని ఛేదించి జగన్ నాయకత్వాన్ని మరింత బలపరిచారని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి ఫలాలకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయని అన్న ఏలూరి.. ప్రజలంతా వైఎస్‌ జగన్‌ను గుండెల్లో పెట్టుకుని ప్రతి ఎన్నికల్లో తీర్పునిస్తున్నారని వెల్లడించారు. టీడీపీకి కంచుకోటలుగా ఉన్న కుప్పం, పామర్రు, మైలవరం, నారావారిపల్లె సెగ్మెంట్లలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం జననేత జగనన్న పనితీరుకు నిదర్శనం అన్నారు. కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే పసిగట్టిన టీడీపీ తన అభ్యర్థులను నిలబెట్టి మరీ కాడి వదిలేసి పారిపోయిందని ధ్వజమెత్తారు. ఇక కిందపడ్డా తామే పైచేయి అన్నట్టు టీడీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్నా సిగ్గులేకుండా నైతిక విజయం మాదే అని చెప్పుకోవడం ఆ పార్టీ దివాలాకోరు తనానికి నిదర్శనమని ఏలూరి ఆరోపించారు. అలాగే ఓడిపోయిన ప్రతిసారీ ఎన్నికలకు అసెంబ్లీ వెళదాం రండి అంటున్న చంద్రబాబు.. ముందు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణ ఓటమితో టీడీపీకి  దడ మొదలైందని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఖచ్చితంగా ఓడిస్తారని జోశ్యం చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: