గురువులకు సలామ్

ఉపాధ్యాయులయుల విశిష్టతను చెప్పే

హ్యేపీ టీచర్స్ డే పాట ఆవిష్కరణ


(జానో జాగో వెబ్ న్యూస్_ ఖమ్మం ప్రతినిధి)

‘వుయ్ లవ్ యూ టీచర్...సచ్చే దిల్ సే కర్తే హై ఆప్ కో సలాం’అంటూ గురువు గొప్పతనాన్ని చాటుతు చిన్నారి సమ్రా సరూష్ పాడిన పాటను ఆక్స్ ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ జాఫర్ అలీ మతీన్ ఆవిష్కరించారు. అబ్దుల్లాహ్ జావిద్ అనే యూట్యూబ్ చానల్ వారు చిత్రీకరించిన పాటను పాడిన సమ్రా సరూష్ ను జాఫర్ అలీ మతీన్ అభినందించారు. గురువు పట్ల గౌరవాన్ని పెంచేలా ఉన్న ఈ పాట సందేశాత్మకంగా ఉందని ఆయన కొనియాడారు. పాటలో ఉన్న స్ఫూర్తిని విద్యార్థులు కొనసాగించాలని జాఫర్ అలీ మతీన్ అన్నారు. తమ వల్ల జరిగే తప్పులను, పొరపాట్లను  సంస్కరించే టీచర్లను ఆదరించే లా ఈ పాట ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. చదవడం, రాయడం నేర్పి జీవిత పాఠాలు చెప్పి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే గురువులను గౌరవించాలని సాగే ఈ పాట చిన్నారులనే కాదు పెద్దలనూ ఎంతగానో ఆకట్టుకుంటోందని అన్నారు. విద్యార్థుల క్షేమాన్ని కోరుకునే గురువుల పట్ల ఎల్లప్పుడూ మర్యాదగా ఉండాలని చెప్పే ఈ పాటను సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా మంచి ఆదరణ పొందుతోందని అన్నారు.

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: