*బ్యాంకు చోరీ విఫల యత్నం*

*ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ పరిసర ప్రాంతాలను,.. పరిశీలించిన ఎస్పీ మలిక గర్గ్

అధికారులకుపలు సూచనలు 

ప్రకాశంం జిల్లా ఎస్పిి

(జానో జాగో వెబ్ న్యూస్ _మార్కాపురం ప్రతినిధి)

       ప్రకాశం జిల్లా, సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందేరు గ్రామంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నందు గత రాత్రి తేది:01.09.2021 న గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు చోరీకి ప్రయత్నించగా జరిగింది. బ్యాంకు నందు ఏర్పాటుచేయబడిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, పటిష్ట భద్రతతో పరికరాల వలన చోరీయత్నం విఫలమమైయింది. ఈ సమాచారం తెలుసుకున్న ప్రకాశం ఎస్పీ గారు వెంటనే సంఘటన ప్రదేశాన్నిసందర్శించి, ఈ చోరీ లో పాల్గొన్న అనుమానిత వ్యక్తుల వివరాలు, బ్యాంకు చుట్టూ ఏర్పాటు చేయబడిన భద్రతా ప్రమాణలు, సెక్యూరిటీ ఏర్పాట్లు, చుట్టూ ఉన్న ప్రాంతం యొక్క పరిసరాలు మరియు ఏర్పాటు చేయబడిన CC కెమెరాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.


అనంతరం బ్యాంకు అధికారులతో సంఘటన గురించి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చోరీ యత్నంపై నమోదు చేయబడిన కేసు యొక్క ఆధారాలను త్వరితగతిన సేకరించి, కేసును చేధించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ గారు ఆదేశించారు. అదే విధంగా బ్యాంకు భద్రతపై మారుతున్న కాలానుగుణంగా సాంకేతికత ఉపయోగించి తదనుగుణంగా నూతన భద్రత పరికరాలు, అలారాలను అమర్చుకోవాలని మరియు సెక్యూరిటీ విషయంపై బ్యాంకు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు.

అనంతరం మహిళా పోలీసులతో ఎస్పీ మాట్లాడి కొత్త వ్యక్తులు ఎవరు అయిన వస్తున్నారా మరియు తదితర విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా నేరం జరిగితే వెంటనే అ ప్రదేశమునకు వెళ్లి సాక్ష్యా ధారాలను చెదిరి పోకుండా చూడాలని, వెంటనే సమాచారం ఎప్పటికప్పుడు క్రమానుగత పోలీస్ అధికారులకు తెలియపరచాలని సూచించారు.

పాతపాత నేరస్తులపై నిఘా ఉంచాలని, బీట్ సిస్టమును పటిష్టంగా అమలు పరచాలని అధికారులకు ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట DSB DSP  బి.మరియాదాసు, దర్శి DSP V.నారాయణ స్వామిరెడ్డి ,అద్దంకి CI M.రాజేష్ ,  సంతమాగులూరు ఎస్సై జి.శివనారాయణ,క్లూ టీం సిబ్బంది మరియు బ్యాంకు  అధికారులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: