ప్రజాక్షేమం కోసమే నిర్ణయాలు..
పండగ చేసుకోవద్దని ఎవరైనా చెబుతారా
మత రాజకీయాలు ఆపండి
వైసీపీ రాష్ట్ర నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
ఏపీలో టీడీపీ, భారతీయ జనతా పార్టీల నేతలు కొద్దిరోజులుగా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. బహిరంగ వినాయక చవితి ఉత్సవాల విషయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలు మాత్రమే పాటిస్తుంటే తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టే ముందు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై కూడా మాట్లాడాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టే బహిరంగ వేడుకలకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల్ని కాపాడుకోవడమే మొదటి ప్రాధాన్యత అన్న ఏలూరి.. మహమ్మారి సమయంలో కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్టో బీజేపీ, టీడీపీ నేతలు కూడా ఆలోచించాలన్నారు. ఎన్నికల కోసం మత రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవడం వారికే నేతలకే చెల్లిందన్న ఆయన.. కొన్నేళ్లుగా ఇదే ధోరణని అవలంబిస్తూ బ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు ‘పండగ’ కేంద్ర బిందువు అని. పండుగలు శుభసూచకాలై, ప్రతి కుటుంబంలో కష్టనష్టాలను మరపించి, నూతనోత్సాహాన్ని కలిగిస్తాయని.. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా జనం మధ్య కార్యక్రమాలు నిర్వహించుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. అందునా వినాయక చవితి అంటే వేలాదిమంది జనం గుమిగూడే అవకాశం ఉంది కనుకనే పూజలు ఇంట్లోనే చేసుకోని బహిరంగ ఉత్సవాలకు దూరంగా ఉండాలని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని.. కానీ ప్రతిపక్షాల వారు మాత్రం దీనిని చిలవలు పలువులు చేసి ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దారుణమని ఏలూరి మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజల్ని అన్ని విధాలా ఆదుకోవడం తోపాటు టెస్టులు ఎక్కువగా చేసి మహమ్మారి భారీనుంచి కాపాడామన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి మెడిసిన్ అందించి తోడ్పాటును అందించామని ఇప్పుడిప్పుడే పరిస్థితులలో కొంత మెరుగు కనిపిస్తుందని.. అలాంటి తరుణంలో మళ్ళీ బహిరంగ కార్యక్రమాలకు అనుమతించి ప్రజల్ని ఇబ్బందులపాలు చేయడం మంచిది కాదని.. ఇకనైనా బీజేపీ, టీడీపీ మత రాజకీయాలు చేయడం మానుకోవాలని ఏలూరి రామచంద్రారెడ్డి హితవు పలికారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: