చంద్రబాబు మాటలు విని,,, 

అభివృద్ధి నిరోధకులుగా మారకండి  

టీడీపీ నేతలకు డాక్టర్ ఏలూరి సూచన 

జిల్లాను అని విధాలా అణగదొక్కి ఇప్పుడు భేటీలా?

*వెలిగొండ జోలికి వస్తే చంద్రబాబు ఇంటివద్ద ఉద్యమిస్తాం..

(జానో జాగో వెబ్ న్యూస్ -విజయవాడ ప్రతినిధి)

ప్రకాశం జిల్లాకు చెందిన నేతలతో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని నేతలకు హితబోధ చేశారు. అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లాను అన్ని విధాలా అణగదొక్కిన చంద్రబాబు ఈ భేటీలు నిర్వహించి ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా జిల్లాకు పరిశ్రమలు ఇవ్వకుండా, వెలిగొండ ప్రాజెక్టు కట్టకుండా, యువతకు ఉపాథి కల్పించకుండా..అతి ముఖ్యమైన రాజధానిని ఈ జిల్లాలో కట్టాలని శివరామకృష్ణ కమిటీ సూచిస్తే స్వార్ధంతో ఆయన సామాజిక వర్గంవారు ఎక్కువగా వుండే ప్రాంతానికి తరలించి జిల్లాకు తీరని అన్యాయం చేశారని.. అయితే ఇప్పుడు జననేత జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జిల్లా అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని.. ఇది చూసి ఓర్వలేని చంద్రబాబు జిల్లా నేతలను పిలిపించుకొని జగన్ ప్రభుత్వం  విమర్శలు చేయాలనీ ఉసిగొల్పారని విమర్శించారు.


చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసినా జిల్లాలో టీడీపీ బతకదని అన్నారు ఏలూరి.  మరో ఏడాదిలో పూర్తి అయ్యే వెలిగొండ ప్రాజెక్టు విషయంలో  కుట్రలు చెయ్యాలని చూస్తే మాత్రం రైతులతో కలిసి చంద్రబాబు ఇంటివద్ద ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలు కూడా టీడీపీ హయాంలో జిల్లాకు ఏం అభివృద్ధి జరిగిందో ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాలి చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టును కట్టడం తోపాటు పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం భారీ ఫిల్టర్ యంత్రాలను ఏర్పాటు చేశామని.. మార్కాపురంలో మెడికల్ కాలేజీ, అంతేకాదు దొనకొండ ప్రాంతంలో 1400 ఎకరాల్లో పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్రాన్ని ఒప్పించామన్నారు. అలాగే జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఒక యూనిట్ గా తీసుకున్నామని.. రామాయపట్నం పోర్టుకు శ్రీకారం చుట్టామని ఇలా అన్ని రకాలుగా జిల్లాను అభివృద్ధి చేస్తుంటే సహకరించాల్సిందిపోయి.. చంద్రబాబు చెప్పిన మాటలకు రెచ్చిపోయి అభివృద్ధి నిరోధకులుగా మారవద్దని టీడీపీ నేతలకు ఏలూరి రామచంద్రారెడ్డి సూచించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: