వినాయక చవితి పండుగ...

ఇండ్ల వద్దనే జరుపుకోండి

 ప్రకాశంజిల్లా ఎస్పీ మలిక గర్గ్ 

ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, ఐ.పి.ఎస్.

 (జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి) 

కరోనా దృష్ట్యా వినాయక చవితి పండుగను వెళ్లవద్దని జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ప్రకాశం జిల్లా ఎస్పీమలిక గర్గ్    కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా కరోనా నివారణ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన  ఉత్తర్వులను ప్రజలందరు తప్పకుండా పాటించాలి. రాష్ట్రంలో కరోనా ముప్పు ఇంకా కొనసాగుతున్నందున కరోనా వ్యాప్తి నివారణకై రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్ ఉత్తర్వుల జారీ చేశారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వీధులలో విగ్రహ ప్రతిష్ఠ, ఊరేగింపు, ప్రజలు గుంపుగా ఏర్పడుట వంటి వాటికి అనుమతి లేదు. పట్టణాలు, గ్రామాలలో ఎవరైనా వీధిలో విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు. తమ తమ ఇండ్లలోనే చేసుకోవాలి. ప్రజలు, తమ తమ ఇండ్లలో విగ్రహ ప్రతిష్ట చేసుకొని కరోనా నిబంధనలు తప్పక పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు, చేతులకు శానిటైజర్ మరియు భౌతిక దూరం పాటించుచూ ఉత్సవం నిర్వహించవలెను.

వినాయక చవితి పండుగను జరుపుకొనే తొమ్మిది రోజులు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదు. వినాయక విగ్రహాల నిమజ్జనం మరియు ఊరేగింపులు నిషిద్ధము కావున ప్రజలు అందరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతము కోవిడ్-19 కరోనా విజృంభనను దృష్టిలో ఉంచుకొని బహిరంగంగా వీధులలో, ఇతర ప్రదేశాలలో పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి, పందిర్లు వేసి భారీ ఎత్తున ప్రజలు గుంపులు గుంపులుగా డీ.జేలు డప్పు విన్యాసాలు ఉత్సవాలు నిర్వహించుటకు పోలీస్ వారి అనుమతి లేదు. వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించుటకు వీలైనంతవరకు మట్టి వినాయకుని ప్రతిమలతో తమ తమ ఇండ్లలోనే గణపతి పూజా మహోత్సవాలను నిర్వహించు కోవాలి. పెద్ద విగ్రహాలు నిమర్జనం చేయదలిచిన యడల కుటుంబ సభ్యులు ఇద్దరు లేక ముగ్గురు వెళ్లి కోవిడ్ నిభందనలను పాటిస్తూ నిమర్జనం చేయాలి. 

*ప్రతి భక్తుడు, ప్రతి నిర్వాహకుడు క్రింద ఇవ్వబడిన నియమ నిబంధనలను పాటించుచూ, వినాయక చవితిని కోవిడ్ రహిత వినాయక చవితిగా జరుపుకోవాలని కోరడమైనది.

1.దేవాలయం ముందు శానిటేషన్, ధర్మల్ స్క్రీనింగ్ పరికరాలను ఉపయోగించాలి.

2.దేవాలయంలో కోవిడ్ లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే అనుమతించాలి.

3.మాస్క్ ఉంటేనే లోపలకి అనుమతించాలి.

4.కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఫ్లెక్సీలను, వాల్ పోస్టర్ లను ఏర్పాటు చేయాలి. 

5.వీడియో మరియు  ఆడియోల ద్వారా ప్రజలకు కోవిడ్  గురించి అవగాహన కల్పించాలి.

6.బయట వాహనాల పార్కింగ్ స్థలంలో ప్రజలను గుమిగూడా  కుండా భౌతిక దూరం పాటించే విధంగా దేవాలయ అధికారులకు సూచించాలి. 

7.దేవాలయాల బయట షాపులు వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.

8.దేవాలయ పరిసర ప్రాంతాలలో మార్కింగ్ లతో సరైన గుర్తులతో భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయాలి. 

9.సందర్శకుల కొరకు ప్రత్యేకమైన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేయాలి.

10.ఎంట్రీ ప్రాంతాలలో క్యూ లను ఏర్పాటు చేసి, కనీసం ఆరు అడుగుల బౌతిక దూరం సందర్శకులు మధ్య ఉండేలా చూడాలి.

11.దేవాలయ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించేముందు సందర్శకులను వారి యొక్క చేతులను, కాళ్ళు శుభ్రం చేసుకోవాలి.

12.దేవాలయం లోపల భక్తుల కొరకు కూర్చునే వసతి వద్ద భౌతిక దూరం ఉండేవిధంగా  ఏర్పాటు చేయాలి.

13.విగ్రహాలను, దేవాలయంలో ఉన్న దైవ సంబంధమైన వస్తువులని వాంటివి తాకరాదు.

14. దేవాలయంలోకి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన SOP ప్రకారం ఉండాలి.

15.పండగ శుభాకాంక్షలను తెలియ చేసుకునేటప్పుడు భౌతిక దూరం పాటిస్తూ శుభాకాంక్షలను తెలియచేయాలి.

16.సామూహిక ప్రార్థన చేసే సమయంలో భక్తులు వారికి సంబంధించి ప్రత్యేకమైన మ్యాట్లు, దుస్తులను తెచ్చుకోవాలి.

17.ప్రసాదాలను, భక్తులకు భౌతికంగా అందించటం, తీర్థాలు భక్తులపైన చల్లటం వంటివి చేయరాదు.  

18.సామూహిక అన్నదానం వంటి కార్యక్రమాలు, వంటచేయు సందర్భాలలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.

19.దేవాలయ ప్రాంతంలో క్రిమిసంహారక ద్రావణం ద్వారా తరచుగా క్లీనింగ్ చేయటం చేయాలి.

20.దేవాలయాన్ని సందర్శించే సందర్శకులకి పేస్ కవర్లు, మాస్కులు, గ్లౌజులు సక్రమంగా అందే విధంగా చూడాలి.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: