హాజీపూర్ బాధితులకు న్యాయం చేయండి
హోం మంత్రిని కోరిన వి.హనుమంత రావు
(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)
హజీపూర్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు హోంమంత్రి మహమ్మద్ అలీని కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి లకిడికపూల్ లోని హోంమంత్రి కార్యాలయంలో ఆయనకు వీహెచ్ వినతిపత్రాన్ని అందజేశారు. హజీపూర్ గ్రామంలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి చేతిలో హత్యచేసిన నిరు పేద కుటుంబాల పిల్లలను 2019లో బావిలో పూడ్చి పెట్టడం జరిగిందని వీహెచ్ గుర్తుచేశారు. ఇంతవరకు ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోవడం విచారకరమన్నారు.
ఇటీవల సైదాబాద్ సింగరేణి కాలనిలో హత్యచేసిన నిందితునికి సరైన శిక్ష జరగడంతో పాటు ప్రభుత్వం బాధిత కుటుంబానికి 20లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చిందని...అలాగే హజీపూర్ బాధిత కుటుంబాలకు కూడా 20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కి ఉరిశిక్ష అమలు చేయాలి వీహెచ్ కోరారు.
Post A Comment:
0 comments: