ఉసిగొల్పి...దాడులకు ప్రేరేపించేలా

కేటీఆర్ వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత జి.నిరంజన్ ఆగ్రహం

(-జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఉసిగొల్పి కెటీఆర్ ప్రతి పక్షాల పై టీఆర్ఎస్ కార్యకర్తలను దాడులకు ప్రేరేపించేలా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని టి.పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ ఆగ్రహంవ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జి.నిరంజన్ మాట్లాడుతూ... నిన్న జలవిహార్ లో జరిగిన టి.అర్. ఎస్ పార్టీ సమావేశములో కెటీఆర్ ప్రతి పక్షాల పై తమ కార్యకర్తలను ఉసికొల్పి రెచ్చ కొట్టి దాడులు చేసేలా మాట్లాడారు. ఆయన మిడిమిడి ఙానము తో కన్ను మిన్ను గానకుండా వాస్తవాలను వక్రీకరించి ఏదేదో మాట్లాడారు. మంత్రిగా ఉండి అలా మాట్లాడినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆత్మ విమర్శ చేసుకొవాలి. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దో, ఒకటి తిడితే పది తిట్టండి అని వారి కార్యకర్తలను ఉసికొల్పిన్నందులకు పోలీసులు ఆయన పై కేసులు పెట్టాలి. ఇక మీదట రాష్ట్రములో కాంగ్రెస్ కార్యకర్తల పై ఎక్కడ దాడి జరిగినా కెటీఆర్ పై ఆయా పోలీసు స్టేషన్ల లో కంప్ల యింట్ చేసి కేసులు నమోదు చేయిస్తాం. కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను జి.నిరంజన్ ప్రస్తావించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఇలా అన్నారు...ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్య‌మా అని ప‌ద‌వులు రాగానే.. గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు. చిల్ల‌ర మాట‌లు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్ల‌ర‌గాళ్లు ఎగిరెగిరి ప‌డుతున్నారు. టీ – కాంగ్రెస్, కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? యని కెటిఆర్ కాంగ్రెస్ ను విమర్శిస్తూ మాట్లాడారు. అసలు మీరు మీ కుటుంబము అధికారానికి వచ్చి కులుకడము, మీ నాయన సి.ఎమ్ మీరు మంత్రి కావడము , కాంగ్రెస్ పార్టీ , సోనియా గాంధి పెట్టిన భిక్ష కాదా ? సోనియా గాంధీ తెలంగాణా ఇవ్వకుంటే మీ నాయన కెసిఆర్ సి.ఎమ్ అయ్యే వారా? మీరు మంత్రి అయ్యే వారా ? అసలు మీరు తిరిగి అమెరికా వెళ్ళి పోయే వారా కాదా? చెప్పండి. కెటిఆర్ మాటలు చూస్తుంటే " చోర్ ఉల్టా కొత్వాల్ కో డాటే " అనే సామేత ఙ్నాపకమొస్తుంది. కె.సి.ఆర్ వలననే ఇతర పార్టీల నాయకులకు గుర్తింపు వచ్చిందనడము ఆయన అఙ్ఞానికి నిదర్శనము. హాస్యాస్పదం. తెలంగాణా ఏర్పడక ముందే ప్రధాన మంత్రి అయిన తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు పి.వి. నరసింహా రావు కె.సి.ఆర్ వలన అయ్యాడా కె.టి.అర్ చెప్పాలి. తెలంగాణా కాంగ్రెస్ బిడ్డలు శ్రీ పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, డా: మర్రి చెన్నారెడ్డి, శ్రీ టి. అంజయ్య ఉమ్మడి రాష్ట్రములోనే సి.ఎమ్ లయ్యారు. ఉమ్మడి రాష్ట్రములోనే తెలంగాణా కాంగ్రెస్ బిడ్డలు బి.వి.గురుమూర్తి, పి.నర్సారెడ్డి, జలగం వెంగళరావు, వి.బి.రాజు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, జి.వెంకటస్వామి, మల్లు అనంథరాములు, వి.హనుమంత రావు, కమాలుద్దీన్ అహ్మద్, మల్లికార్జున్, ఎమ్. సత్యనారాయణ రావు, డి.శ్రీనివాస్, కె.కేశవరావులు 1969 నుండి 2011 మద్యలో పి.సి.సి అధ్యక్షులయ్యారు. వి. హనుమంత రావు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కెసిఆర్ ఉమ్మడి రాష్ట్రములో ఉపాధ్యక్షుడిగా ఉన్న విషయము కెటిఆర్ గుర్తించి మాట్లాడాలి. కె.సి.ఆర్ రాజకీయ గురువు మదన్ మోహన్, బాగా రెడ్డి మరియు పి. జనార్ధన్ రెడ్డి లు ఉమ్మడి రాష్ట్రములోనే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా అందరి మన్ననలను పొందారు. నిజామ్ కాలములోనే 1938 లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు కెసిఆర్ ఎక్కడ? ఆనాడు పోరాటము చేసిన నాయకులు జమలాపురం కేశవరావు స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావుల కాలి గోటికైనా కెసిఆర్ సరిపోతాడా? ప్రతిపక్ష నాయకులను మీ నాయన కాలి గోటికి కూడా సరి పోరనడము కె.టి.ఆర్ అహంకారాన్ని, సభ్యతను ప్రతిబింబిస్తుంది. వాళ్ల నాయనను తిట్టడాన్ని ఆక్షేపిస్తున్న కెటీఆర్ ఇతరుల పట్ల పరుష పదజాలాన్ని ఎలా వాడుతున్నారు.? మీ కొక న్యాయము ఇతరుల కొక న్యాయమా? టి.ఆర్.ఎస్ లో గుర్తింపు - పార్టీ కోసము పోరాడిన వారికి కాదు - పార్టీ మారిన వారికే గుర్తింపు. నామినేటెడ్ పదవులని మీ కార్యకర్తలను ఊరించి మభ్యపెట్టకుండా దమ్ముంటే వెంటనే పది రోజులలో నామినేటడ్ పదవులను భర్తీ చేయండి.జి.ఎచ్.ఎమ్.సి ఎన్నికలు జరిగి ఇన్ని రోజులైనా కో ఆప్టెడ్ సభ్యులను వేయకుండా ఎవరు ఆపారు? వాళ్ల నాయనను తిట్టడాన్ని ఆక్షేపిస్తున్న కెటీఆర్ ఇతరుల పట్ల పరుష పదజాలాన్ని ఎలా వాడుతున్నారు.? మీ కొక న్యాయము ఇతరుల కొక న్యాయమా? తాను ఆశిస్తున్న సి.ఎమ్ పదవి చేజారిపోతుందన్న ఆందోళనలో కె.టి.ఆర్ మతి తప్పి మాట్లాడుతున్నాడు. హుజూరాబాద్ ఎన్నిక ఒక సమస్య కాదు, లోకల్ లీడర్లే చూసుకుంటరంటున్న మీరు హరీశ్ రావు లోకల్ లీడరా చెప్పాలి. లమరి కౌశిక్ రెడ్డిని చేర్చుకుని గవర్నర్ నామినేటడ్ కోటా లో ఎం.ఎల్.సి ఎందుకిస్తున్నారు ? కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే బ‌రాబ‌ర్ స‌మాధానం చప్తాం. కుక్క కాటు చెప్పు దెబ్బ త‌ప్ప‌దు. ఓపిక ప‌ట్టినం.. సైలెంట్‌గా ఉండే కొద్ది మాట‌లు ఎక్కువైతున్నాయి అని కేటీఆర్ నిన్న మండిప‌డ్డారు. కె.టి.ఆర్ ఇక మీ ఆటలు సాగవు. ప్రజలు మీ నిజ స్వరూపం తెలుసుకున్నారు. మీలో వణుకు మొదలైనది. అదుపు తప్పి మాట్లాడుతున్నారు.  మిమ్మల్ని నియంత్రించాలని ప్రజలు నిర్ణయించు కున్నారు.వారికి మేము తోడుంటాము. మీకు చరమగీత ము పాడుతాము. మీ తాటాకు చప్పుళకు కాంగ్రెస్ భయపడదు. తెలంగాణా లో రాచరిక పాలనను అనుమతించదు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్, నిజాం రాచరిక పాలనకు స్వస్తి పలికించిన కాంగ్రెస్, కె.సి.ఆర్ కుటుంబ రాచరిక పరిపాలన నుండి తెలంగాణా రాష్ట్రానికి విముక్తి కలిగిస్తుంది. "దగా కిసీకా సగా నహీ , యకీన్ నయీ ఆయతో ఉస్ కా మఖాన్ యా దుఖాన్ కో దేఖో " అనే నానుడిని గుర్తుంచుకోండి అని జి.నిరంజన్ సూచించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: