పోరాటాలే ఊపిరిగా..జనంలోకి టిడిపి..
ద్విముఖ వ్యూహంతో... కదన రంగంలోకి
తండ్రి... తనయుడు.. ఇరువురు విస్తృతంగా జనంలోకి
పార్టీ నేతలతోనూ అదే రకంగా భేటీలు
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టిడిపి గత రెండేళ్ల కాలంలో తిరిగి పుంజుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా టిడిపి నాయకత్వం పలు కోణాల్లో వ్యూహ రచన చేస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యంపై ఎప్పటికప్పుడు జనంలోకి వెళ్తూనే.. మరోవైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూ మళ్లీ టీడీపీ పాలన రావాలని భావన ప్రజల్లో కల్పించేందుకు పదునైన అస్త్రాల ప్రయోగానికి సిద్ధమవుతోంది. పరిపాలన వైఫల్యాలను ఎత్తి చూపుతూ.. వాటిని న్యాయస్థానాలలో సవాల్ చేస్తూ టిడిపి నాయకత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీది పరిపక్వత లేని పాలనగా చిత్రీకరించి మళ్లీ టిడిపి రావాలని భావన ప్రజల్లో కల్పించేందుకు సోషల్ మీడియాను మరోసారి అస్త్రంగా ప్రయోగించాలని భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్న టిడిపి సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను ఉద్ధృతం చేసింది.
పార్టీకి బాసటగా...తండ్రి ..తనయుడు
టీడీపీకి పెద్దదిక్కు చంద్రబాబు తప్ప మరో నేత లేడన్న విమర్శలకు చెక్ పెట్టే దిశగా ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. టిడిపి ప్రతిపక్షంలో కూర్చున్నాక ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా... ఆయన తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ నారా లోకేష్ కూడా కదన రంగంలోకి దిగుతున్నారు. దీంతో పార్టీలోని నాయకత్వాన్ని.. కార్యకర్తలను విస్తృతస్థాయిలో కలిసే అవకాశం కలిగింది. పార్టీ కార్యకర్త పై ఎక్కడైనా దాడులు జరిగిన.. ప్రాణ నష్టం జరిగినా... నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్వయంగా పరామర్శించి వారిలో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీపరంగా ప్రత్యేక పండు ఏర్పాటు చేసి పార్టీ కోసం ప్రాణత్యాగం ఇతర త్యాగాలు చేసి ఇ నష్టపోయిన కుటుంబాలను టిడిపి నాయకత్వం ఆర్థికంగా ఆదుకోవడం ప్లస్ పాయింట్ గా మారుతోంది. గతంలో అధికారంలో ఉండగా టిడిపి నాయకత్వం పార్టీ కార్యకర్తలను ప్రత్యేక రీతిలో ఆదుకునేది. ఇక ప్రభుత్వ వైఫల్యాల విషయంలో పోరాటం చేసే దిశగా పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయడంలో సఫలీకృతం అవుతుంది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలపై చేసే పోరాటంలో టిడిపి ఆందోళనలో ప్రజలపై ప్రభావం చూపే రీతిలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల మాట. ఇదే దూకుడును టిడిపి ఎన్నికల అంతవరకు ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ బలమైన పోటీ ఇవ్వవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
పార్టీ కమిటీల పై ప్రత్యేక దృష్టి...
గతానికి భిన్నంగా పార్టీతో పాటు పార్టీ అనుబంధ విభాగాల ఏర్పాటు పైన టిడిపి నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తద్వారా పార్టీకి దూరమైన వివిధ వర్గాలను, కులాలు, మతాలు, వృత్తుల ఆధారంగా పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసి e వారికి చేరువయ్యేందుకు టిడిపి వ్యూహరచన చేస్తోంది. అంతేకాకుండా వివిధ వర్గాలకు కులాలకు వృత్తుల వారికి జరిగే అన్యాయాల పైన వాటికి సంబంధించిన పార్టీ అనుబంధ సంఘాలను కదన రంగంలోకి దింపి ఆందోళన చేపట్టాలని టిడిపి వ్యూహరచన చేస్తోంది. తద్వారా బాధిత వర్గాలకు త్వరగా చేరువయ్యే అవకాశం ఉంటుందని టిడిపి నాయకత్వం భావిస్తోంది.
సోషల్ మీడియాలో దూకుడు
ఒకపుడు సోషల్ మీడియాలో దూకుడు పెంచిన వైసీపీ ఇపుడు ఉల్టా సీన్ ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాలో ఇపుడు టీడీపీదే అధిపత్యంగా ఉంది. జగన్ని విమర్శిస్తూ తమ్ముళ్ళు ఏపీలో రెండున్నరేళ్ల పాలన మీద సోషల్ మీడియాలో చర్చ పెట్టి దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్రామంతా అప్పుల మయం అంటూ సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ పెడుతున్న పోస్టింగులకు కనీసం కౌంటర్ ఇచ్చే నాధుడు వైసీపీ నుంచి కనిపించడంలేదు. టీడీపీ ఒక సైన్యం మాదిరిగా బాబుతోనే ఏపీ అభివృద్ధి అంటూ గత కొన్నాళ్ళుగా ఒక రకమైన ప్రచారం మొదలెట్టేసింది. నాడు రావాలి జగన్ కావాలి జగన్ అన్న స్లోగన్ లాంటిదే ఇపుడు టీడీపీ చేస్తోంది అక్కడ. నిరుద్యోగులకు జాబ్స్ రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలు రావాలన్నా ఏపీలో ప్రగతి కనిపించలన్నా, పరిశ్రమలు రావాలన్నా బాబు రావలసిందే అంటూ టీడీపీ పెడుతున్న సోషల్ మీడియా పోస్టింగులు తెగ హైలెట్ అవుతున్నాయి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: