ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు,,,
త్వరలో పదోన్నతులు
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
ఆర్టీసీ ఉద్యోగుల నిరీక్షణ ఫలించబోతోంది. త్వరలో వారికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెయ్యిమందికి పైగా పదోన్నతులు లభించనున్నాయి. అధికారుల స్థాయిలో తక్కువగా ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువ పదోన్నతులు దక్కనున్నాయి. మెకానిక్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్ సూపర్వైజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రతి ఒక్కరికీ ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరుకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తు ముమ్మరం చేశారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: