ఫొటోగ్రాఫర్ల పై దాడి అమానుషం

నిరసన వ్యక్తంచేసిన ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లాలో ఈ నెల ఒకటో తారీఖున ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ లో వివాహ కవరేజ్ కి వెళ్ళిన వీడియో గ్రాఫర్ భాష పై దాడి ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది హేయమైన చర్య అని మార్కాపురం ఫోటో మరియు వీడియో గ్రాఫర్లు ... నిందితులపై   వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో వెంకటరమణ స్టూడియో నుండి ర్యాలీ గా బయలుదేరి

 


స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద  ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ వీడియో మిక్సింగ్,ఆల్బమ్ డిజైనర్స్, నిరసన తెలియజేశారు... ప్రతి శుభ, అశుభ కార్యక్రమాలకు పూర్తిగా తమను సంప్రదించిన వారిపై పూర్తి భరోసాతో మేము సమయపాలన చూసుకోకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ , వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్న మా లాంటి వారిపై ఇలా దౌర్జన్యాలు చేయడం చాల దారుణమని  ఈ సందర్భంగా తమ ఆవేదనను తెలియచేశారు.  అనంతరం ఆర్డీవో కార్యాలయంలో డి.టి గారికి వినతిపత్రం అందజేశారు...ఈ కార్యక్రమంలో తాడి బాలకృష్ణ,  శంకర్ రెడ్డి, శివారెడ్డి, భరత్ సింగ్, జిందా షా మదర్ వలి, మోహన్ స్టూడియో మొహమ్మద్ గౌస్, రమేష్, రుద్రవరం శివ, శ్రీనివాస రెడ్డి,రాజ్ కమల్, నాగూర్ తదితరులు హాజరయ్యారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: