చంద్రబాబువి నక్కబుద్ధి నాటకాలు

ఎక్కువ సమయం అధికారంలో ఉన్నా వెలిగొండకు చేసింది శూన్యం 

టీడీపీ పాలనలో రైతులకు ఏమి చేశారో చెప్పాలి

వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)  

రైతులను  నిలువునా దగా చేసిన చంద్రబాబు నేడు రైతులకోసం దీక్షలు, ధర్నాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గత ముప్పై ఏళ్లలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న ఆయన రైతుల బాగుకోసం ఏమి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. వ్యవసాయం దండగ అని కనిగిరి సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలను.. అలాగే రైతులు వ్యవసాయం మానేసి వాచ్ మెన్ ఉద్యోగాలు చేయాలనీ మహబూబ్ నగర్లో మాట్లాడిన మాటలను ప్రజలు మరచిపోలేదని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు పైసా కూడా మాఫీ చేయకుండా నిలువునా ముంచారని చెప్పారు. బాబు హయాంలో వ్యవసాయానికి నీళ్లు రాక వర్షాలు కురవక, పంటలు పండకపోవడంతో చాలా మంది రైతులు వలస వెళ్లారన్న ఏలూరి..
తమ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా వున్నారని.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని.. పంట పండితే గిట్టుబాటు ధర కల్పించడం.. పండకపోతే నష్టపరిహారం చెల్లించడం చేస్తున్నామన్నారు.  భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా ఇలా చేస్తుందా? అని చంద్రబాబును ప్రశ్నించారు. అంతేకాదు ప్రకాశం జిల్లాకు అతి ముఖ్యమైన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో లెక్కలేనన్ని పాపలు చేసి ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారని  ఫైర్ అయ్యారు ఏలూరి. వెలిగొండ ప్రాజెక్టులో కనీసం రెండు శాతం పనులు కూడా తన హయాంలో చేయలేదు.. కానీ వైఎస్ కుటుంబ హయాంలో వెలిగొండ పనులు శరవేగంగా జరుగుతుంటే అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిన ఘనుడు చంద్రబాబ అని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రకాశం జిల్లా పచ్చదనంతో పరినవిల్లుతుందని.. తద్వారా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు మార్మోగుతుందనే కుళ్ళు బుద్ధితోనే వెలిగొండను చంద్రబాబు నిర్లక్ష్యం చేసారని దుయ్యబట్టారు. త్వరలో వెలిగొండ నిర్మాణం పూర్తవుతుంటే ఏదో విధంగా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటన్న ఆయన.. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వెలిగొండ ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు.. ఇకనైనా రైతుల విషయంలో చంద్రబాబు నక్కబుద్ధి నాటకాలను కట్టిపెట్టాలని ఏలూరి రామచంద్రారెడ్డి హితవు పలికారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

     

    

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: