దివ్యాంగుల కొరకు యూత్ ఫర్ జాబ్స్ ద్వారా,,,

శిక్షణ...ఉద్యోగ కల్పన


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్  కార్పొరేషన్ (APSSDC)  మరియు యూత్ ఫర్ జాబ్స్ పౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తేది16-09-2021 న ఉదయం 10 గంటల నుండి  మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ఉపాధి కార్యాలయం, కలెక్టర్ ఆఫీస్ ఎదురు(OLD RIMS), ఒంగోలు యందు, జిల్లాలో ఉన్న 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల లోపు పదవ తరగతి [SSC]  నుంచి పి.జి {PG} వరకు చదువుకున్న నిరుద్యోగ వికలాంగ (PwD) యువతీయువకులకు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు  కల్పించబడుటకు, అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపికకై ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు శ్రీమతి జి .అర్చన, సహాయ సంచాలకులు, డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఒంగోలు, ప్రకాశం జిల్లా వారు తెలియజేసినారు. మరిన్ని వివరములకు ఫోన్ నెo: 9963005209 ను సంప్రదించగలరు.

గమనిక : తమ పని తాము స్వయంగా చేసుకోగలవారై  అయ్యి ఉండాలి. మరియు వారికి సంబంధించిన అంగవైకల్య ధ్రువీకరణ శాత పత్రమును తీసుకురావలెను.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

    


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: