దేశవ్యాప్త సమ్మెలో భాగంగా...

సిఐటియు ఆధ్వర్యంలో విధుల బహిష్కరణ


(జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)     

కేంద్ర ప్రభుత్వం పథకాలలోని కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించి.. తమ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తు..citu ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.. అందులో భాగంగా  తర్లుపాడు ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేయడం జరిగింది.  ప్రధానంగా స్త్రీ శిశు సంక్షేమం విద్య వైద్యం పేదరిక నిర్మూలన ఉపాధి హామీ తదితర పథకాలకు నిధులు పెంచాలని.పథకాల నందు పనిచేస్తున్న వారందరిని కార్మికులుగా గుర్తించాలని. వారి సర్వీసును పరిగణలోకి తీసుకొని రెగ్యులర్ చేయాలని అన్నారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయకుండానే కేంద్ర ప్రభుత్వం పథకాల్లో పనిచేస్తున్న అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం వివోఏలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని.ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని.  విద్యార్థుల మెనూ రేట్లు పెంచాలని. నగదు బదిలీ పథకం ఆలోచనను విరమించాలని కోరారు.


కరోనాకుాకు గురై మరణించిన ఆశ, అంగన్వాడీ వర్కర్లకు 50 లక్షలు ఇన్సూరెన్స్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని అన్నారు.రాజకీయ వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని  డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకోసమే కార్మిక చట్టాలను సవరించారని. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలో భాగంగా 3 వ్యవసాయ నల్ల చట్టాలను తెరపైకి తెచ్చారని. రైతులు 300 రోజులుగా ఆందోళన చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. దేశ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న పాలకులు ప్రభుత్వ రంగాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న తీరును వారు వ్యతిరేకించారు.. ఈ కార్యక్రమంలో యం బాలమ్మ, శివ, జ్యోతి, నాగమ్మ, టి రాజకుమారి, అనంతలక్ష్మి, ముంతాజ్, మల్లేశ్వరి, హైమావతి, పద్మ వరలక్ష్మి, అశ్విని, తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: