పరామర్శకు వెళ్తే...

హత్యాయత్నం కేసు పెడతారా

ఎంపీజే ఏపీ రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ రజాక్ 

 

షేక్. అబ్దుల్ రజాక్ (బాబు) ఎం.పి.జె. 

         ఆంధ్ర రాష్ట్ర కోశాధికారి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

బాధిత కుటుంభాన్ని పరామర్శించడానికి వెళ్తే మైనార్టీ నేతలపై హత్యాయత్నం కేసు పెడతారా అని ఎంపీజే ఏపీ రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ రజాక్ ప్రశ్నించారు.   ఇటీవల కడప జిల్లా మైదుకూరులో అక్బర్ బాషా కుటుంబాన్ని పోలీసులు బెదిరించటంతో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు సంబంధించిన వీడియో అందరి హృదయాలను కదిలించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇలాంటి వేధింపులు తాళలేక గతంలో అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా అక్బర్ భాషా, తన పొలం ఆక్రమించుకున్న తిరుపాల్ రెడ్డిపై అక్బర్ బాషా ఫిర్యాదు చేస్తే మైదుకూరు సీఐ బాధిత కుటుంబాన్ని హింసించి దూషించారు. అవమానం భరించలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేందుకు సెల్ఫీ వీడియో రికార్డు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. రెండు కేసుల్లోనూ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని  అబ్దుల్ రజాక్ ( బాబు )  తెలిపారు. ఈక్రమంలో భాగంగా పరామర్శించటానికి వెళ్లిన ఫారూఖ్ షుబ్లిని బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన అక్బర్ బాషా కుటుంబానికి పరామర్శించడానికి వచ్చిన ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి (MHPS) రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫారుక్ షూబ్లీని అరెస్ట్  చేసి అక్రమ కేసులు బనాయించడం అమానవియం ,సిగ్గుచేటు అని ఆంద్రప్రదేశ్ MPJ  రాష్ట్రశాఖ తీవ్రంగా ఖండిస్తుంది. అన్యాయం జరిగిన భాదితులడికి పరామర్శ కి వెళ్ళిన ముస్లిం నేతల మీద ipc 307,353 సెక్షన్ల కింద అరెస్టు చేయడం మానవ హక్కులను కాలరాయడమేనని MPJ  భావిస్తుంది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అక్బర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే హత్యాయత్న కేసు నమోదు చేస్తారా..? చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి పర్మిషన్ కావాలా? బాధిత  కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే అరెస్టు చేయడంలో ఆంతర్యమేమిటని MPJ  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మొహమ్మద్ ఫారుక్ షూబ్లీ గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని MPJ డిమాండ్ చేస్తుంది.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: