మైనార్టీ సబ్ ప్లాన్ అమలు చరిత్రాత్మకం
- ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ #నదీమ్_అహ్మద్*
(జానో జాగో వెబ్ న్యూస్_అనంతపురం ప్రతినిధి)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైనార్టీల సబ్ ప్లాన్ అమలుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని చట్టంగా తీసుకురావడం వల్ల మైనార్టీ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని నదీమ్ అహ్మద్ గారు జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేడు తన కార్యాలయంలో పలువురు మైనార్టీ సోదరులతో కృతజ్ఞతలు తెలిపారు.
నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీ వర్గాల విద్య, ఉపాధి అవకాశాలను విస్తృతపరుస్తూ 4% రిజర్వేషన్ ఇచ్చారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఉన్నతంగా రెండడుగులు ముందుకు వేస్తూ ఏ రాష్ట్రం తీసుకొని విధంగా సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుపర్చడానికి మైనార్టీ వర్గాలకు సబ్ ప్లాన్ తీసుకురావడం జరిగిందని దీని వల్ల ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి ఎంతో మేలు చేకూరుస్తుందని, తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది మత పెద్దలు, విజ్ఞులు జగన్మోహన్ రెడ్డి గారికి తమ తరఫున కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరడం జరిగిందన్నారు.
*సబ్ ప్లాన్ వల్ల వచ్చే లాభాలు:*
- సబ్ ప్లాన్ అమలు చెయ్యడం వల్ల జనాభా ప్రతిపాదకన బడ్జెట్లో నిధులు కేటాయించడం జరుగుతుంది.
- ఈ నిధులు మంజూరుతో మైనార్టీల సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి ఎంతో ఊతమిస్తుంది.
- ప్రత్యేక నిధులు కేవలం మైనార్టీల సంక్షేమానికే ఖర్చు పెడతారు.
- ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏవైనా నిధులు ఆ సంవత్సరం ఖర్చు పెట్టని యెడల మరి వచ్చే సంవత్సరానికి ఆ నిధులు ట్రాన్సఫర్ చెయ్యబడుతాయి.
కార్యక్రమంలో మైనార్టీ నేతలు 18వ డివిజన్ కన్వీనర్ అజీజ్, 50వ డివిజన్ కన్వీనర్ మహబూబ్ బాషా, జక్రియా సాబ్, ముస్తఫా సాబ్, జాఫర్ సాబ్, మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిజాముద్దీన్, ఆకుల తబ్రేజ్, ఆకుల షకీల్ మరియు ఇతర మత పెద్దలు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: