బేషరతుగా కలీం సిద్దీఖీని... విడుదల చేయాలి
మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్
(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)
ప్రముఖ ఇస్లామీయ పండితులు, సంఘసంస్కర్త, మౌలానా కలీం సిద్దీఖీని అరెస్ట్ చేసి ఉత్తరప్రదేశ్ , కేంద్ర ప్రభుత్వాలు తమ దురుద్ధేశాన్ని, పిరికితనాన్ని చాటుకున్నాయి అని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అభిప్రాయపడింది.ధార్మిక గురువుల మధ్య ఇంటర్ ఫైత్ చర్చల ద్వారా అపోహలు తొలగించడం,మతసామరస్య సాధనకు కృషి చేయడం నేరం ఎలా ఔతుంది అని,రాజ్యాంగ బహిరంగ ఉల్లంఘనను MPJ తీవ్రంగా ఖండిస్తుందని,
షేక్. అబ్దుల్ రజాక్ (బాబు)
ఎం.పి.జె. ఆంధ్ర రాష్ట్ర కోశాధికారి
కేంద్ర ప్రభుత్వంలొ ఉన్న వారికి , ఇటువంటి చర్యలకు మద్దతు పలుకుతున్న వారు మీడియా ముందే రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ అవాకులు,చేవాకులు చేసేవారికి లేని కేసులు, సామరస్యం కొరకు పాటుపడే వారి మీద కేసులు బనాయించడం దుర్మార్గం. ప్రజాస్వామిక వాదులు, సంస్థలన్నీ ముక్త కంఠంతో ఈ అరెస్టును ఖండించాలని MPJ పిలుపునిస్తుంది. బేషరతుగా కలీం సిద్దీఖీని విడుదల చేయాలని మూవ్ మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ రాష్ట్ర అద్యక్ష ,కార్యదర్శి, కొశాధికారిలు షేక్ అబ్దుల్ సుభాన్,MMD ఖాశిం,షేక్ అబ్దుల్ రజాక్ లు డిమాండ్ చేస్తున్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: