భూ ఆక్రమాలపై,,,

విచారణ చేయించండి

కలెక్టర్ కు బీజేపీ నేతల వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం పట్టణం, మార్కాపురం రూరల్,  తర్లుపాడు, కొనకనమిట్ల, పెద్దారవీడు  మండలాల్లో జరిగిన  భూ ఆక్రమణలపై  పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను  బీజేపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ ఓ వినతిపత్రం అందజేశారు. ఆ వినతిపత్రంలోని సారాంశం ఇలావుంది. ప్రకాశం జిల్లా  వెనుకబడిన ప్రాంతమైన   పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో  అనేక వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. చాలా రోజులుగా ఈ ప్రాంతంలో  రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులు, దళారులు  కుమ్మక్కై ప్రభుత్వ భూములతో పాటు ఏ అండలేని ప్రవేటు వ్యక్తుల భూములను కబ్జా చేశారు  అయితే తమరు వచ్చిన తర్వాత ఈ భూ అక్రమాలపై విచారణ జరిపి  కొంతమంది రెవెన్యూ అధికారులపై  చర్యలు తీసుకున్నారు  ఈ రకమైన చర్యలకు మార్కాపురం పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు నేనున్నాంటూ మీరు పూర్తి భరోసా యిస్తున్న తీరుకు  భారతీయ జనతా పార్టీ మీకు ధన్యవాదాలు తెలుపుతుంది. ప్రభుత్వ భూమిని కాజేసే ఈ పన్నాగంలో  భూ బకాసురల  కబంధ హస్తాలలో ఇంకనూ వందల ఎకరాలు ఉండిపోయాయి.
వీటిని పూర్తి స్థాయి విచారణ జరిపి  రాజకీయ నాయకులు, దళారుల పై క్రిమినల్ కేసులు  నమోదు చేయడంతో పాటు నిజాయితీపరుడైన  అధికారితో పూర్తి స్థాయి విచారణ జరిపితే  దేశ ప్రజల ఆస్తి అయిన వందల ఎకరాలను ప్రభుత్వం తిరిగి రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది.  కావున ఉన్నత ఆశయాలతో ప్రజల కోసం పని చేస్తున్న మీరు  ఇటువంటి దుర్మార్గుల ఆట కట్టించి మరొకసారి  ఇటువంటి సంఘటనలు జరగకుండా  రాజకీయ నాయకులు అవినీతి అధికారులు, ముఖ్యంగా భూ బకాసురులు పై కఠినమైన చర్యలు తీసుకోవాలని  భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనత పార్టీ ప్రధమ, ద్వితీయ శ్రేణి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: