వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
*అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు
వైసిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సూచించారు. రాబోయే రోజులలో అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం అందుతున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని.. అలాగే కొండప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లడం చేయాలన్నారు. మరోవైపు రైతులు, రైతు కూలీలు రెండు మూడు రోజులు వ్యవసాయ పనులకు దూరంగా ఉండటం మంచిదన్నారు.
ఏలూరి. భారీ వర్షాల తోపాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని. ఇలాంటి సమయాల్లో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలని కోరారు. కాగా గులాబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసిందన్న ఏలూరి.. ప్రభుత్వం అప్రమత్తం కావడంతో నష్టం జరగలేదని తెలిపారు. ఈ సందర్బంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment:
0 comments: