ప్రభుత్వ పాఠశాల హెచ్ ఎంల సమావేశం
పలు తీర్మానాల ఆమోదం
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
స్ధానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి అధ్యక్షతన సోమవారంనాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ యాజమాన్యం లోని ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయుల కార్యశాల నిర్వహించారు. విద్యార్థుల జ్ఞాన సమపార్జన నైపుణ్యాల పెంపుపై చేపట్టవలసిన కార్యక్రమాలపై జరిగిన కార్యశాలలో..
విద్యార్థుల హక్కులు.. భాధ్యతలు అందు ఉపాధ్యాయుల పాత్ర.. విద్యార్దుల వ్యక్తిత్వ వికాసం.. సమగ్రమైన అభివృద్ధి సాధనకు నేర్చుకోవడానికి.. అన్వేషణ.. పరిశోధన మరియు నూతన విద్యాపోకడలు..సహ పాఠ్యకార్యక్రమాలు విలువల జోడింపును ప్రోత్సహించడం ఎలా.. తదితర అంశాలపై చర్చించి..సమగ్ర విద్యావికాస కార్యాచరణకు విధివిధానాలను తీర్మానించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి. యం.శ్రీనివాసరెడ్డి. టి.శ్రీనివాసులు. ఒ.రవిశేఖర్ రెడ్డి. వి.ఆంజనేయులు. రిసోర్స్ పర్శన్ లు గా వ్యవహరించగా. ఎ ప్రభాకర్ రెడ్డి సమన్వయకర్త గా వ్యవహరించారు. నియోజకవర్గంలోని ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: