గడివేముల వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థి,,

తెలుగు నాగ మద్దమ్మ. ఎంపీపీగా ఏకగ్రీవం

(జానో జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా గడివేముల మండల కేంద్రమైన స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో గడివేముల లో గెలిచిన వై ఎస్ ఆర్ సి పి ఎంపిటిసి అభ్యర్థులు అందరూ ప్రమాణస్వీకారం ఎమ్మెల్యే కాటసాని  అధ్యక్షతన గడివేముల మండల జడ్పిటిసి అభ్యర్థి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ ప్రమాణస్వీకారం చేశారు. గడివేముల మండల కో ఆప్టెడ్ మెంబర్ గా గడిగరేవుల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ భాష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .గడివేముల మండలంలోని గనిగ్రామానికి చెందిన తెలుగు నాగ మద్దమ్మ గారిని ఎంపీపీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .గెలిచిన అభ్యర్థులు మాట్లాడుతూ


గ్రామంలోంలో ప్రతి ఒక్కరిని  అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి గ్రామాలలో పారిశుద్ధ్యం లేకుండా మంచి నీటి సౌకర్యం కొరత లేకుండా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు. మాపై నమ్మకం ఉంచి  మాకు పదవులు ఇచ్చిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి గడివేముల జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు శివానంద రెడ్డి గారికి అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.


 గడివేముల మండల కో ఆప్టెడ్ నెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అందుకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జెడ్ పి టి సి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న షేక్ హుస్సేన్ భాష

గడివేముల మండల ఎంపిపి గా ఏకగ్రీవంగా ఎన్నికైన అందుకు ఏ .శివానంద రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా తెలుగు నాగ మద్దమ్మ

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: