పంట నమోదు తోపాటు,,,

రైతులు  ఇన్ కేవైసీ చేయించుకోండి

సలహామండలి సమావేశంలో అధికార్ల సూచన


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని 11 రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశం నందు గ్రామ వ్యవసాయ సలహామండలి సభ్యులు మరియు రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు గ్రామ వ్యవసాయ అనుబంధ శాఖల సహాయకులు హాజరైనారు. సమావేశం నందు వ్యవసాయానికి సంబంధించిన వివిధ స్కీముల వివరములు తెలియ పరచినారు. మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో ఆర్ బి కే నందు నిర్వహించిన సమావేశమునకు మండల వ్యవసాయ అధికారి ఆర్.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ


సమావేశంలో పంట నమోదు కార్యక్రమము ప్రతి రైతు విధిగా తాము వేసుకో పడిన పంట రకము ను 1 బి అడంగల్ కాఫీ మరియు ఆధార్ కార్డును ఆర్.బి కే కు వచ్చి పంట నమోదు చేయించుకుని డిజిటల్ యాక్నాలెడ్జ్మెంట్ ను పొందవలెను. ఈ క్రాఫ్ట్ బుకింగ్ అయినా ప్రతి రైతుకు వైయస్సార్ ఉచిత పంటల బీమా, పంట నష్ట పరిహారం, పంట ఉత్పత్తులు, గిట్టుబాటు మద్దతు ధరలు వర్తించును. అని తెలియజేశారు. ప్రతి ఆర్ బి కే నందు  ఈ సంవత్సరం నుండి కొనుగోలు కేంద్రములు ప్రారంభించి పంట ఉత్పత్తులు ఆర్ బి కే నందు ఎం ఎస్ పి ధరల కు కొనుగోలు చేయబడును అని తెలియజేశారు. అదేవిధంగా గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రం నందు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచుతున్నాను తెలియ అని  చేసినారు. పంట నమోదు తోపాటు రైతులు  ఇన్ కేవైసీ చేయించుకోవాలని తెలియజేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: