ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ప్రజలు కరోనా తగ్గుతోంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని.. అలాగే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎస్సార్సీ ల్యాబోరెటరీస్ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సూచించారు. కరోనా తీవ్రత తగ్గుతున్నప్పటికీ హెర్డ్ ఇమ్మ్యూనిటీ వచ్చేంతవరకూ అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. 80 శాతం ప్రజలకు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయితేనే హెర్డ్ ఇమ్మ్యూనిటీ వస్తుందని రామచంద్రారెడ్డి తెలిపారు.
ఒక దేశం లేదా ప్రాంతంలోని మొత్తం జ‌నాభాలో సాధ్య‌మైనంత ఎక్కువ మందికి యాంటీబాడీలు వృద్ధి చెందితేనే మహమ్మారిని నిర్మూలించవచ్చన్న ఏలూరి.. అందువల్ల ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుని కరోనా ఫ్రీ దేశంగా తీర్చిద్దేందుకు దోహద పడాలని డాక్టర్ ఏలూరి ఆకాక్షించారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ పై అపోహలు తొలగించుకుని 18 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ నిర్దేశించిన కేంద్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకున్నపుడే కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నివారించగలమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కరోనా అదుపులోనే ఉన్నట్టుగానే కనపడుతుందన్న ఏలూరి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: