డాక్టర్ బి.సి.రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అసోసియేషన్

సహకారంతో ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలోని  మార్కాపురం పట్టణములో గల ఎల్.ఐ.సి. కార్యాలయములో ఎల్.ఐ.సి. వారోత్సవాల సందర్భంగా ఒంగోలుకు చెందిన ప్రముఖ నల్లూరి నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.సి.రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎల్.ఐ.సి. ఏజంట్ల యూనియన్ అధ్యక్షులు ఇమామ్ సాహెబ్ మాట్లాడుతూ తమ ఏజంట్లు వ్యాపార నిమిత్తము కరోన నేపధ్యంలో కూడ ప్రతి ఒక్కరితో మమేకమై తమకు కేటాయించిన టార్గెట్ చేరుకొనే దశలో అన్ని రంగాలలోని వ్యక్తులతో కలసేవారు, ఇటువంటి వారందరికి ఈ ఉచిత మెడికల్ శిబిరం ద్వారా అన్ని రకాల పరిక్షలతో పాటు ఉచతంగా మందుల పంపిణీ కార్యక్రమములో మమ్మల్ని భాగస్వామ్యం చేయటం,


ఆ సేవా కార్యక్రమాన్ని నేను అధ్యక్షత వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు.  ఏర్పాటుచేసిన ఈ ఉచిత మెడికల్ క్యాంపు లో ఎల్ఐసి ఆఫీస్ సిబ్బందితో పాటు ఏజెంట్ మిత్రులకు   బీపీ, షుగర్, ఇసీజీ తదితర  పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎల్ ఐ సి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మహేష్ గారు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ గారు, ఎల్.ఐ.సి.ఏజెంట్ల   యూనియన్ అధ్యక్షులు ఇమామ్ సాహెబ్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఏజెంట్లు, కార్యాలయ  సిబ్బంది పాల్గొన్నారు. 

 


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: