సంక్షేమం.. అభివృద్ధి కోసం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కలెక్టర్ ప్రవీణ్ కుమార్

ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

(జానో - జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పురోగతి సాధించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజక వర్గాలలో చేపడుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, గృహ నిర్మాణ పనులపై మండలస్ధాయి అధికారులతో తహసిల్దార్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ముందుగా పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామం సచివాలయాన్ని, యర్రగొండపాలెంలోని గ్రామ సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాల భవనాలను పరిశీలించారు. ప్రభుత్వ భవనాలను వేగంగా పూర్తి చెయ్యడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లకు కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణల మ్యాపింగ్, గ్రౌండింగ్ ప్రక్రియ ఈ నెల 16వ తేదిలోగా పూర్తి చేయాలన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో 7,833 గృహాలు మంజూరు కాగా ప్రస్తుతం 4,566 గృహాల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయన్నారు. మిగిలిన 3,267 గృహాలు  ఈ నెల 16వ తేదిలోగా గ్రౌండింగ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. యర్రగొండపాలెంలో 1,600 గృహాల నిర్మాణ పనులు గ్రౌండింగ్ కాకపోవడంపై మండలాల వారీగా సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇసుక, ఇనుము కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల పురోగతిలో ప్రకాశం జిల్లా మూడవ స్ధనంలో వుందని, అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. త్రిపురాంతకం మండలంలో నిర్మాణాలు మొదలు కాకపోవడంపై ఆరా తీశారు. నిర్మాణ పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. అధికారుల మధ్య అంతరాలు తొలగిపోవాలన్నారు. ఇసుక కొరత వుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గృహ నిర్మాణాలకు స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో భూమి ఆడిట్ జరగాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. భూ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆయన సూచించారు. సచివాలయం పనితీరు, ప్రభుత్వ సేవలు అమలు తీరుపై ఆరా తీశారు. సచివాలయంలో దస్త్రాలను హాజరు పట్టికలను పరిశీలించారు. పనితీరు మరింత మెరుగుపడాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది క్షేత్ర పరిశీలన చేయాలన్నారు. 104 మొబైల్ మెడికల్ క్యాంపు  పనితీరును పరిశీలించారు. 826 మందికి కోవిడ్ టీకా వేయగా కేవలం 85 మంది మిగిలారని గొబ్బూరు సచివాలయ సిబ్బంది ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో మండల తహసిల్దార్ వీరయ్య, ఎంపిడీఓ సాయి కుమార్, పిఆర్, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: