వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి

ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నేత జి.నిరంజన్ విజ్ఞప్తి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఎన్నికల కమిషన్ ఉపఎన్నికల నిర్వహణపై తమ నిర్ణయాన్ని కేవలం రాజకీయ దృక్పదంతో కూడిన రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయలపై ఆధారపడకుండా స్వతహాగా వాస్తవ పరిస్తితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని టి.పి.సి.సి. సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బెంగాల్ , ఒరిస్సా లలో ఉప ఎన్నికలకు తేదీ ఖరారు చేసిన ఎన్నికల కమిషన్ తెలంగాణా లోని హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీని నిర్ణయించక పోవడము, అదీ సి.ఎమ్ కె.సి.ఆర్ డిల్లీలో ఉన్నపుడే ప్రకటించడము పలు అనుమానాలకు దారి తీస్తుంది.గతములో అసెంబ్లీని రద్దుచేసిన కె.సి.ఆర్ మధ్యంతర ఎన్నికలు జరిపే తేదీల విషయంలో ఎన్నికల కమీషనర్లతో మాట్లాడానని మీడియా సమావేశంలోనే ప్రకటించిన విషయం గమనార్హం. విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు తెరుస్తూ, కరోనా నిబందనలు పాటించకుండా హుజూరాబాద్ లో దళితబంధు సమావేశాలు జరుపుతున్న రాష్త్ర ప్రభుత్వానికి ఎన్నికలనే వరకు కరోనా సాకు చూపడం హాస్యాస్పదం. ఎన్నికలు ప్రకటించకున్నా హుజూరాబాద్ లో జరుగుతున్న ప్రచార హోరును ఎన్నికల కమిషన్ గుర్తించటము లేదా? రాష్ఠ్ర ఎన్నికల అధికారి నివేదించటము లేదా ? ఆశ్చర్యకరం. హుజూరాబాద్ లో ప్రచార ఉదృతిని కట్టడి చేయకుండా ఎన్నికలను ఎంత పొడిగిస్తే కరోనా ముప్పు అంత అధికముగా ఉంటుందని ఎన్నికల కమిషన్ గ్రహిస్తే మంచిది. వివిధ పథకాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగము చేసి ఎన్నికలలో లబ్ధి పొందే వెసులుబాటు కోసమే టి.ఆర్.ఎస్ ప్రభుత్వము సత్వర ఎన్నికలను అడ్డుకుంటుంది. ఎన్నికలను వాయిదా వేయడమంటే అధికార దుర్వినియోగానికి అనుమతించటమే. టి.ఆర్.ఎస్ పార్టీ స్వార్థ లక్ష్యాలకు ఎన్నికల కమిషన్ ఉపయోగ పడ కూడదు. ఎన్నికల కమిషన్ ఒక ఉన్నత స్ఠాయి అధికారుల బృందాన్ని హుజూరాబాద్ పంపి అక్కడ నెలకొని ఉన్న పరిస్తితులను, జరుగుతున్న అధికార దుర్వినియోగాన్ని అంచనా వేసి సత్వరమే ఎన్నికలు నిర్వహించాలి. అని ఆయన డిమాండ్ చేశారు.
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: